గిరిజనులకు అండగా పోలీస్‌శాఖ

ABN , First Publish Date - 2021-10-08T05:37:46+05:30 IST

పోలీస్‌శాఖ ఎల్లప్పుడూ గిరిజనులకు అండగా ఉంటుందని ఎస్పీ దీపికా పాటిల్‌ అన్నారు.

గిరిజనులకు అండగా పోలీస్‌శాఖ
మాట్లాడుతున్న ఎస్పీ దీపికా పాటిల్‌

ఎస్పీ దీపికా పాటిల్‌

మక్కువ: పోలీస్‌శాఖ ఎల్లప్పుడూ గిరిజనులకు అండగా ఉంటుందని ఎస్పీ దీపికా పాటిల్‌ అన్నారు. పనసభద్ర పంచాయతీ దిగువమెండంగిలో పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెగా వైద్య శిబిరాన్ని గురువారం ఆమె ప్రారంభించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ గిరిజనులకు ఎటువంటి సమస్యలు ఎదురైనా తమ దృష్టికి తీసుకురావాలన్నారు. గిరిజన యువత క్రీడల్లో రాణించేలా, ఉద్యోగాలు సాధించేలా శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. సుమారు 20 గ్రామాల గిరిజన ప్రజలు నిత్యావసర సరుకులు కోసం దగ్గేరు గ్రామానికి వెళ్తామని, కాజ్‌వే శిథిలావస్థకు చేరుకోవడంతో ఇబ్బందులు పడుతున్నామని, అడారుగెడ్డపై వంతెన నిర్మించాలని గిరిజనులు ఎస్పీ దృష్టికి తీసుకువెళ్లగా, ఉన్నతాధికారులతో మాట్లాడతామని ఆమె హామీ ఇచ్చారు. అనంతరం గిరిజన యువతకు వాలీబాల్‌ కిట్లు, వృద్ధులకు చీరలు, దుప్పట్లు, గొడగు లు, మందులను పంపిణీ చేశారు. కార్యక్ర మంలో ఓఎస్‌డీ ఎన్‌.సూర్యచంద్రరావు, పార్వతీపురం డీఎస్పీ ఎ.సుభాష్‌, సాలూరు సీఐ ఎల్‌.అప్పలనాయుడు, ఎస్‌ఐ ఎస్‌.షణ్ము ఖరావు, పోలీస్‌ సిబ్బంది పాల్గొన్నారు.   అనంతరం ఆమె స్థానిక పోలీస్‌స్టేషన్‌, 198ఎఫ్‌ బెటాలియన్‌ను సందర్శించారు. జిల్లాలో మావోయిస్టు ప్రభావం ఏమీ లేదని  చెప్పారు. మావోయిస్టు ప్రాబల్య ప్రాంతాల్లో నిత్యం ప్రత్యేక బలగాలతో ఆర్‌వోపీ, వాహన తనిఖీలు నిర్వహిస్తున్నామన్నారు.     

 


 

Updated Date - 2021-10-08T05:37:46+05:30 IST