గిరిజనులకు సరుకులు పంపిణీ చేసిన పోలీసులు

ABN , First Publish Date - 2021-06-22T07:16:23+05:30 IST

పెంబి మండలంలోని పసుపుల గ్రామ పంచాయతీ పరిధిలోని మారుమూల గ్రామాలైన రాగిదుబ్బ, నాయికపు గూడెం, కోలం గూడెం, దోందారి, వస్పెల్లి గ్రామాల గిరిజన ప్రజలకు సోమవారం నిత్యావసర సరుకులను జిల్లా ఎస్పీ సిహెచ్‌. ప్రవీణ్‌ కుమార్‌ చేతుల మీదుగా పంపిణీ చేశారు.

గిరిజనులకు సరుకులు పంపిణీ చేసిన పోలీసులు
నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తున్న ఎస్పీ

పెంబి, జూన్‌ 21 : పెంబి మండలంలోని పసుపుల గ్రామ పంచాయతీ పరిధిలోని మారుమూల గ్రామాలైన రాగిదుబ్బ, నాయికపు గూడెం, కోలం గూడెం, దోందారి, వస్పెల్లి గ్రామాల గిరిజన ప్రజలకు సోమవారం గూన్జ్‌ ఆర్గనైజేషన్‌, ఢిల్లీ వారి సౌజన్యంతో పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో దాదాపు 200 మందికి నిత్యావసర సరుకులను జిల్లా ఎస్పీ సిహెచ్‌. ప్రవీణ్‌ కుమార్‌ చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. గ్రామాల్లో ఉన్నటువంటి పరిస్థితులను పోలీసులకు సహాయ సహకారాలు అందించాల న్నారు. ఫ్రెండ్లీపోలీస్‌లో భాగంగా పోలీసులు అంటే భయంపోయి పోలీసు లకు అన్ని రకాల సహాయ సహకారాలు అందించాలన్నారు. చిన్నారులను ప్రతీఒక్కరిని చదువుకునేలా చూడాలని, చదువు అనేది అన్నింటికీ ఆయుధ మని, చదువుకుంటే పేదరికాన్ని పోగొట్టుకోవచ్చన్నారు. విద్యార్థులు పదవ తరగతి కాకుండా కనీసం డిగ్రీ వరకు చదువుకుంటేనే అప్పుడు మాత్రమే మీరు అన్ని రకాలైనటువంటి ఉద్యోగాలకు అవకాశాలు పొందటానికి ఉప యోగపడుతుందన్నారు. ప్రభు త్వం కల్పించే అవకాశాలను ఉపయోగించు కొని ప్రతీవ్యక్తిని గ్రామంలో కనీసం డిగ్రీ వరకు చదువుకుంటే ప్రభుత్వం అన్ని రకాలైనటువంటి స్కాలర్‌షిప్‌లను ఇస్తుందని, వాటిని ఉపయోగించు కోవాలన్నారు. చదువు కోవాల్సిన బాధ్యత తీసుకోవడం ద్వారా సమాజానికి మంచి చేయగలుగుతారని, రైతులు విత్తనాలు కొనుగోలు చేసే సమయంలో జాగ్రత్తగా వ్యవహరించాలన్నారు. తక్కువ ధరకు వస్తున్నాయని అత్యాశకు పోయి నకిలీ విత్తనాలు కొనవద్దన్నారు. లైసెన్సు కలిగిన వ్యాపారుల వద్ద విత్తనాలు కొనుగోలు చేసి రసీదులు తప్పకుండా తీసుకోవాలన్నారు. ఆ తర్వాత రసీదులను పంట అమ్ముకునే వరకు భద్రపర్చుకోవాలని సూ చించారు. యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని, గుడుంబా, గుట్కా మొదలైనవి.. ఇవన్నీ మన ఆరోగ్యానికి మేలు చేయవన్నారు. కాబట్టి సాధ్యమైనంత వరకు దూరంగా ఉంచి మన ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ కా పాడాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉంటుందన్నారు. అదే విధంగా పోలీసుల నుండి మీకు ఏ విధమైనటువంటి సహయ సహకారాల కోసం మీరు నేరుగా నిర్మల్‌ వచ్చి కలువవచ్చని అన్నారు. ఈ కార్యక్రమంలో నిర్మల్‌ డీఎస్పీ ఉపేందర్‌రెడ్డి, ఖానాపూర్‌ సీఐ శ్రీధర్‌, కడెం ఎస్సై రాజు, దస్తూరాబాద్‌, ఎస్సై రాహుల్‌, గ్రామసర్పంచ్‌, గ్రామస్థులు మరియు పోలీస్‌ సిబ్బంది పాల్గొన్నారు.


Updated Date - 2021-06-22T07:16:23+05:30 IST