మానవత్వం బతికే ఉంది... ఈ సంఘటనే నిదర్శనం..!

ABN , First Publish Date - 2020-08-08T19:54:53+05:30 IST

నా అనే వారు లేరు. ఒకరికి ఒకరు తోడుగా ఉంటున్నారు తల్లీ కూతుళ్లు...! ఆరోగ్యం క్షీణించి వృద్ధురాలైన తల్లి హఠాత్తుగా చని పోయింది. కుమార్తె ఒంటరైంది.

మానవత్వం బతికే ఉంది... ఈ సంఘటనే నిదర్శనం..!

నా అనే వారు లేరు. ఒకరికి ఒకరు తోడుగా ఉంటున్నారు తల్లీ కూతుళ్లు...! ఆరోగ్యం క్షీణించి వృద్ధురాలైన తల్లి హఠాత్తుగా చని పోయింది. కుమార్తె ఒంటరైంది. ఒకవైపు కళ్లలో కన్నీటి సుడులు తిరుగుతున్నాయి.. మరోవైపు తల్లికి దహన సంస్కారాలు ఎలా? ఆ బాధ గుండెను దహించివేస్తుంది. ముందు కొచ్చే వారు లేరు. కాళ్లు చేతులు ఆడడం లేదు. ఏం చేయాలో అర్థం కాలేదు. ఎవర్ని అర్థించినా... ‘కరోనా భయం వణికిస్తోంది. ఎవర్ని ముట్టుకోవాలన్నా ఒకటే అనుమానం’ అన్న సమాధానాలే వినిపించాయి. ఈ విపత్కర సమయంలో పోలీసులు మానవత్వం చాటుకున్నారు.


శుక్రవారం ఒంగోలు నగర పరిధి, కొప్పోలు రోడ్డులోని రాజీవ్‌ గృహ కల్ప నాల్గో లైన్‌లో 60 ఏళ్ల వృద్ధురాలు పోతూరి నాగరత్నం(60) ఆకస్మికంగా మృతి చెందింది. నిస్సహాయ స్థితిలో తల్లి మృతదేహాన్ని ఇంటి బయట రోడ్డు మీద పెట్టి కుమార్తె పరమేశ్వరి రోదిస్తుంది. సమాచారం తెలుసుకున్న తాలుకా సీఐ ఎం.లక్ష్మణ్‌ తన సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహం ఖననం చేసేందుకు చర్యలు చేపట్టారు. ము నిసిపల్‌, రె వెన్యూ అధికారు లతో చర్చించా రు. కొవిడ్‌ నిబం ధనల ప్రకారం అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు. మున్సిపల్‌ సిబ్బంది సహకారంతో మృతదేహాన్ని శ్మశానవాటికకు తరలించారు. మృతురాలి కుమార్తె పరమేశ్వరి పోలీస్‌లకు, మునిసిపల్‌ సిబ్బం దికి చేతులు జోడించి కృతజ్ఞతలు తెలిపింది. 


-ఒంగోలు(క్రైం)

Updated Date - 2020-08-08T19:54:53+05:30 IST