క్వారంటైన్ లోకి వెళ్లలేదని.. హత్యాప్రయత్నం కేసు

ABN , First Publish Date - 2020-03-27T01:40:47+05:30 IST

కరోనా పాజిటివ్ అని తేలినా క్వారంటైన్ లోకి వెళ్లకుండా, మామూలుగా ఉంటున్న ఇద్దరు పోలీసుల కళ్ళబడ్డారు. దాంతో వారిద్దరిపై అట్టెంప్టెడ్ మర్డర్ కేసులు దాఖలు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

క్వారంటైన్ లోకి వెళ్లలేదని.. హత్యాప్రయత్నం కేసు

కేప్ టౌన్: ప్రపంచాన్ని కరోనా మహమ్మారి గజగజలాడిస్తోంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 4 లక్షలపైగా ప్రజలు ఈ వైరస్ బారిన పడ్డారు. ఈ క్రమంలో పలుదేశాల్లో ప్రభుత్వాలు లాక్ డౌన్ ప్రకటించి, కరోనాను ఓడించడానికి ప్రయత్నిస్తున్నాయి. వీటిలో సౌతాఫ్రికా కూడా ఒకటి. ఇక్కడ లాక్ డౌన్ నియంత్రణలు అధిగమించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే కరోనా పాజిటివ్ అని తేలినా క్వారంటైన్ లోకి వెళ్లకుండా, మామూలుగా ఉంటున్న ఇద్దరు పోలీసుల కళ్ళబడ్డారు. దాంతో వారిద్దరిపై అట్టెంప్టెడ్ మర్డర్ కేసులు దాఖలు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఇప్పటికి సౌతాఫ్రికాలో 709 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో 21 రోజులపాటు దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధిస్తున్నట్లు.. సౌతాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రామఫోస ప్రకటించారు.


Updated Date - 2020-03-27T01:40:47+05:30 IST