ఇద్దరు ఫ్రెండ్స్‌తో ఇంట్లోనే భర్త మందు పార్టీ.. ఓ మిత్రుడిని ఇంట్లోనే ఉంచి రాత్రి 10 గంటలకు దుకాణానికి వెళ్లి తిరిగొచ్చి చూస్తే..

ABN , First Publish Date - 2022-01-21T21:31:23+05:30 IST

అతడికి దాదాపు రెండేళ్ల క్రితం ఓ మహిళతో వివాహం జరిగింది. ఈ క్రమంలో ఆ దంపతులకు బాబు కూడా జన్మించాడు. తాజాగా అతడు తన ఫ్రెండ్స్‌ను ఇంటికి తీసుకొచ్చి మద్యంతో పార్టీ ఏర్పాటు చేశాడు. పార్టీ

ఇద్దరు ఫ్రెండ్స్‌తో ఇంట్లోనే భర్త మందు పార్టీ.. ఓ మిత్రుడిని ఇంట్లోనే ఉంచి రాత్రి 10 గంటలకు దుకాణానికి వెళ్లి తిరిగొచ్చి చూస్తే..

ఇంటర్నెట్ డెస్క్: అతడికి దాదాపు రెండేళ్ల క్రితం ఓ మహిళతో వివాహం జరిగింది. ఈ క్రమంలో ఆ దంపతులకు బాబు కూడా జన్మించాడు. తాజాగా అతడు తన ఫ్రెండ్స్‌ను ఇంటికి తీసుకొచ్చి మద్యంతో పార్టీ ఏర్పాటు చేశాడు. పార్టీ మధ్యలో రాత్రి 10 గంటల వేళ ఒక మిత్రుడిని ఇంట్లోనే ఉంచి.. మరో మిత్రుడితో కలిసి దగ్గర్లోని దుకాణానికి వెళ్లాడు. తీరా అతడు ఇంటికి తిరిగొచ్చే సరికి అక్కడ ఘోరం జరిగిపోయింది. కాగా.. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..



రాజస్థాన్‌లోని జైపూర్ ప్రాంతానికి చెందిన వ్యక్తికి సుమారు రెండు సంవత్సరాల క్రితం ఓ మహిళతో వివాహం జరిగింది. పెళ్లికి ముందే మద్యానికి అలవాటు పడిన అతడు.. పెళ్లై కొడుకు పుట్టినా దాన్ని మానలేదు. ఈ క్రమంలోనే బుధవారం రాత్రి తన స్నేహితులు లాలూ, రవిరాజును ఇంటికి పిలిచి మద్యం పార్టీ ఏర్పాటు చేశాడు. రాత్రి 10 గంటల వేళ.. లాలూ తనకు గుట్కా, బీడీ కావాలని కోరడంతో.. రవిరాజుతో కలసి అతడు స్థానికంగా ఉన్న దుకాణానికి వెళ్లాడు. దీన్ని అవకాశంగా భావించిన లాలూ.. ఇంట్లో ఒంటరిగా ఉన్న స్నేహితుడి భార్యపై అత్యాచారం చేశాడు. అనంతరం అక్కడ నుంచి పరారయ్యాడు. దుకాణం నుంచి తిరిగొచ్చాక తన భార్యపై జరిగిన దారుణాన్ని తెలుసుకుని అతడు ఒక్కసారిగా షాకయ్యాడు. మరుసటి రోజు ఉదయం ఆ భార్యాభర్తలు స్థానికంగా ఉన్న పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లాలూపై ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసుకున్న అధికారులు.. లాలూ కోసం గాలింపు చర్యలు ప్రారంభించారు. 




Updated Date - 2022-01-21T21:31:23+05:30 IST