బ్రేకింగ్.. అజ్ఞాతంలోకి వెళ్లిన డొనాల్డ్ ట్రంప్!

ABN , First Publish Date - 2020-06-01T18:21:26+05:30 IST

నల్లజాతీయుల నిరసన సెగ శ్వేత‌సౌధాన్ని తాకింది. దీంతో ట్రంప్‌ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. జార్జి ఫ్లాయిడ్ అనే నల్లజాతి యువకుడిని

బ్రేకింగ్.. అజ్ఞాతంలోకి వెళ్లిన డొనాల్డ్ ట్రంప్!

వాషింగ్టన్: నల్లజాతీయుల నిరసన సెగ శ్వేత‌సౌధాన్ని తాకింది. దీంతో ట్రంప్‌ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. జార్జి ఫ్లాయిడ్ అనే నల్లజాతి యువకుడిని.. శ్వేతజాతి పోలీసు అధికారి అతికిరాతకంగా కాలితో తొక్కి చంపిన విషయం తెలిసిందే. దీంతో జాతి వివక్షతపై నల్లజాతీయులు గళం విప్పారు. అమెరికా వ్యాప్తంగా అన్ని ప్రధాన నగరాల్లోని వీధుల్లోకి వచ్చి నిరసనలు తెలుపుతున్నారు. ‘జార్జి ఫ్లాయిడ్‌ను చంపిన పోలీసు అధికారిని కఠినంగా శిక్షించాలంటూ’ నినాదాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో శాన్‌ఫ్రాన్సిస్కో, అట్లాంటా, లూయిస్‌విల్లె, లాస్‌ ఏంజెల్స్ తదితర నగారల్లో అధికారులు కర్ఫ్యూలు విధించారు. కాలిఫోర్నియా, జార్జియా, ఓహియో తదితర 11 రాష్ట్రాల్లో నిరసనకారులను అదుపు చేయడానికి నేషనల్ గార్డ్ కూడా రంగంలోకి దిగింది. అయితే వీటిని లెక్కచేయని నిరసనకారులు.. వైట్‌హౌస్‌ను ముట్టడించేందుకు ప్రయత్నించారు. ఇందులో భాగంగా శ్వేతసౌధం పరిసర ప్రాంతాల్లోకి నిరసనకారులు చేరుకున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులను ధ్వంసం చేస్తున్న నిరసనకారులపై టియర్ గ్యాస్, పెప్పర్ స్ప్రే, నిప్పురవ్వలను వెదజల్లే గ్రనేడ్‌లను ఉపయోగించారు. కాగా.. నిరసన సెగ శ్వేతసౌధాన్ని తాకడంతో.. అధికారులు అప్రమత్తమయ్యారు. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సహా అతని కుటుంబ సభ్యులను అధికారులు బంకర్‌లోకి తరలించారు. ఇదిలా ఉంటే.. స్థానిక నాయకులు మాత్రం నిరసనకారలు సంయమనం పాటించాలని కోరుతున్నారు.


Updated Date - 2020-06-01T18:21:26+05:30 IST