పోలీసు అమరుల త్యాగాలు వెలకట్టలేనివి

ABN , First Publish Date - 2021-10-21T05:30:00+05:30 IST

పోలీసు అమరవీరుల త్యాగాలు వెలకట్టలేనివని సంగారెడ్డి జిల్లా ఎస్పీ ఎం.రమణకుమార్‌ పేర్కొన్నారు. పోలీసు అమరవీరుల సంస్మరణ కార్యక్రమం గురువారం సంగారెడ్డి జిల్లాకేంద్రంలోని పోలీసు పెరేడ్‌గ్రౌండ్‌లో గురువారం నిర్వహించారు. పోలీసు ఉన్నతాధికారులు పోలీసు అమరవీరుల స్తూపం వద్ద పుష్పగుచ్ఛాలను ఉంచి ఘనంగా నివాళులర్పించారు.

పోలీసు అమరుల త్యాగాలు వెలకట్టలేనివి
పోలీసు అమరులకు నివాళులర్పించి సెల్యూట్‌ చేస్తున్న సంగారెడ్డి ఎస్పీ రమణ కుమార్‌, ఉన్నతాధికారులు

కరోనా కట్టడిలో పోలీసుల పాత్ర కీలకం

జిల్లా ఎస్పీ రమణకుమార్‌


సంగారెడ్డి క్రైం, అక్టోబరు 21 : పోలీసు అమరవీరుల త్యాగాలు వెలకట్టలేనివని సంగారెడ్డి జిల్లా ఎస్పీ ఎం.రమణకుమార్‌ పేర్కొన్నారు. పోలీసు అమరవీరుల సంస్మరణ కార్యక్రమం గురువారం సంగారెడ్డి జిల్లాకేంద్రంలోని పోలీసు పెరేడ్‌గ్రౌండ్‌లో గురువారం నిర్వహించారు. పోలీసు ఉన్నతాధికారులు పోలీసు అమరవీరుల స్తూపం వద్ద పుష్పగుచ్ఛాలను ఉంచి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఎస్పీ రమణకుమార్‌ మాట్లాడుతూ జిల్లాలో నలుగురు వీరజవాన్లు తీవ్రవాదులు, అసాంఘిక, సంఘవిద్రోహశక్తుల దుశ్చర్యలకు బలయ్యారని గుర్తుచేసుకున్నారు. సిర్గాపూర్‌ పోలీ్‌సస్టేషన్‌కు చెందిన జంగయ్య, సంగారెడ్డి పట్టణ పోలీ్‌సస్టేషన్‌కు చెందిన ఎల్లయ్య, జిన్నారం పోలీ్‌సస్టేషన్‌ కు చెందిన సత్యనారాయణ, కంగ్టి పీఎ్‌సకు చెందిన సురేష్‌ ఆయా సంఘటనల్లో అమరులయ్యారని పేర్కొన్నారు. వారి త్యాగాలు మరువలేనివని కొనియాడారు. 


కరోనా కట్టడిలో విలువైన సేవలు

కరోనా వైరస్‌ ఉధృతి కొనసాగుతున్న సమయంలో ప్రజల ప్రాణాలను రక్షించడానికి జిల్లాలో పోలీసులు సమర్థంగా పనిచేశారని ఎస్పీ పేర్కొన్నారు. లాక్‌డౌన్‌ను అమలుచేసే క్రమంలో నలుగురు పోలీసులు వైరస్‌ బారినపడి ప్రాణాలు పోగొట్టుకున్నారని తెలియజేశారు. ఎస్‌ఐ ప్రభాకర్‌, ఏఎ్‌సఐ మన్నె రాములు, హెడ్‌కానిస్టేబుల్‌ మల్లమ్మ, కానిస్టేబుల్‌ చాకలి బస్వరాజ్‌ వైరస్‌ బారినపడి కన్నుమూశారని గుర్తుచేసుకున్నారు. అమరవీరుల కుటుంబాలకు పోలీసు శాఖ తరపున సానుభూతి తెలియజేస్తున్నట్టు పేర్కొన్నారు. పోలీసు అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ ఈ నెల 31 వరకు జిల్లావ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు వివరించారు. విద్యార్థులకు ఆన్‌లైన్‌లో వ్యాసరచన పోటీలు, ప్రజలకు ఆన్‌లైన్‌లో ఫొటోగ్రఫీ పోటీలు, పోలీసు శాఖ పనితీరును ప్రజలకు వివరించడానికి ఆన్‌లైన్‌లో ఓపెన్‌హౌస్‌ కార్యక్రమం, జిల్లావ్యాప్తంగా రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. అడిషనల్‌ ఎస్పీ కె.సృజన మాట్లాడుతూ గడిచిన ఏడాది దేశవ్యాప్తంగా అమరులైన 377 మంది పోలీసు అమరవీరుల పేర్లను వెల్లడించారు. అనంతరం పెరేడ్‌ కమాండర్‌ కృష్ణ ఆధ్వర్యంలో స్మృతి పెరేడ్‌ నిర్వహించారు. అనంతరం పోలీసు అమర వీరుల కుటుంబాలతో జిల్లా ఎస్పీ మాట్లాడి సమస్యలను తెలుసుకుని, వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో సంగారెడ్డి డీఎస్పీ ఎ.బాలాజి, ఎస్‌బీ డీఎస్పీ శ్రీనివా్‌సనాయుడు, ఏఆర్‌ డీఎస్పీ జనార్దన్‌, డీసీఆర్‌బీ సీఐ రామకృష్ణ, సంగారెడ్డి పట్టణ, రూరల్‌ సీఐలు బి.రమేష్‌, శివలింగం, ఆర్‌ఐలు హరిలాల్‌, డానియల్‌, ఎస్‌ఐ సుభాష్‌, దుర్గారెడ్డి, ఆసీఫ్‌ అలీ తదితరులు పాల్గొన్నారు. 


అమరుల కుటుంబాలకు అండగా ఉంటాం

మెదక్‌ అర్బన్‌, అక్టోబరు 21: పోలీసు అమరవీరుల దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం మెదక్‌ జిల్లాకేంద్రంలోని ఏఆర్‌ హెడ్‌క్వాటర్స్‌లో సంస్మరణ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్‌  ప్రతిమసింగ్‌ అమరవీరుల స్తూపం వద్ద పుష్పగుచ్ఛాన్ని ఉంచి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ జిల్లా పరిధిలో 14 మంది పోలీసులు విధి నిర్వాహణలో వీరమరణం పొందారని గుర్తుచేసుకున్నారు. ప్రజల రక్షణ కోసం వారు చేసిన త్యాగం ఎప్పటికీ గుర్తుంచుకుంటారన్నారు. అమరుల కుటుంబాలకు పోలీసుశాఖ అండగా నిలుస్తుందని చెప్పారు. అనంతరం అమరుల కుటుంబాలను సన్మానించారు. జిల్లాలో పోలీసు సిబ్బందికి నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు. ఎస్‌ఐల విభాగంలో ప్రథమ స్థానంలో సందీ్‌పరెడ్డి, ద్వితీయ స్థానంలో పల్లవి, కానిస్టేబుళ్లు, ఏఎ్‌సఐల విభాగంలో ప్రథమ బహుమతి బాసిత్‌, ద్వితీయ బహుమతి కవిత, తృతీయ బహుమతి నవీన్‌ అందుకున్నారు. అమరవీరులకు నివాళిగా సాయంత్రం మెదక్‌ పట్టణంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో ఏఎస్పీ కృష్ణమూర్తి, జిల్లా ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ ఎంఏ రజాక్‌, మెదక్‌, తూప్రాన్‌ డీఎస్పీలు సైదులు, కిరణ్‌కుమార్‌, ఏఆర్‌ డీఎస్పీ శ్రీనివాస్‌, పట్టణ సీఐ వెంకట్‌, రూరల్‌ సీఐ పాలవెల్లి, ఆర్‌ఐ సూరపునాయుడు, ఎస్‌ఐ, ఆర్‌ఎ్‌సఐలు పాల్గొన్నారు. 

Updated Date - 2021-10-21T05:30:00+05:30 IST