Abn logo
Sep 9 2021 @ 15:43PM

లోకేష్‌‌కు నోటీసులు ఇచ్చిన పోలీసులు

విజయవాడ: గుంటూరు జిల్లా, నరసారావుపేటలోని బాధిత అనూష కుటుంబాన్ని పరామర్శించేందుకు వచ్చిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ను గన్నవరం ఎయిర్ పోర్టులోనే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పర్యటనకు అనుమతి లేదని చెప్పడంతో లోకేష్ పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనుమతి లేకుండా జాతీయ రహదారిపై ర్యాలీగా వచ్చారని పోలీసులు పేర్కొంటూ 41ఏ సీఆర్పీసీ నోటీసులు ఇచ్చారు. శాంతిభద్రతలకు ఆటంకం కలిగించారని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు.


లోకేష్‌, డ్రైవర్‌ మినహా మిగతావారిని వాహనం నుంచి పోలీసులు దించివేశారు. ఈ ఘటనపై టీడీపీ నేతలు అభ్యంతరం తెలిపారు. అనంతరం లోకేష్‌ను ఉండవల్లిలోని ఇంటికి తరలించారు. వాహనం వెంట టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలి వెళ్లాయి. లోకేష్‌ కాన్వాయ్‌ దాదాపు 2 గంటలపాటు వారధిపైనే నిలిచిపోయింది.