మహారాష్ట్రలో కుక్కకు రిటైర్మెంట్

ABN , First Publish Date - 2021-02-28T03:00:56+05:30 IST

మహారాష్ట్రలో కుక్కకు రిటైర్మెంట్

మహారాష్ట్రలో కుక్కకు రిటైర్మెంట్

మహారాష్ట్ర: పోలీసు జాగిలానికి ఘనంగా వీడ్కోలు పలికారు. నాసిక్‌లో ఈ ఘటన ఒక ఉత్సవంలా జరిగింది. స్పైక్ అనే జాగిలం మహారాష్ట్ర పోలీస్ బాంబ్ డిటెక్షన్ స్వాడ్‌లో 11 ఏళ్ల పాటు సర్వీస్ చేసింది. ఇటీవలే ఆ జాగిలం సేవలకు రిటైర్‌మెంట్ ఇచ్చారు. పోలీసులకు ఎంతో ప్రీతిపాత్రమైన ఆ జాగిలానికి ఘనంగా వీడ్కోలు పలకాలని నిర్ణయించారు. పోలీసు వాహనంపై తిప్పారు. పోలీసులంతా కరతాళ ధ్వనులతో దాన్ని సాగనంపారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 


Updated Date - 2021-02-28T03:00:56+05:30 IST