తప్పిపోయిన బాలుడిని బంధువులకు అప్పగించిన పోలీసులు

ABN , First Publish Date - 2021-10-24T05:00:22+05:30 IST

హాస్టల్‌ నుంచి పారిపోయి అక్క ఇంటికి ముద్దనూరుకు వచ్చిన బాలుడు ఇల్లు కనుక్కోలేక తిరు గుతుండగా పోలీసులు గుర్తించి బాలుడిని బంధువులకు అప్పగిం చారు.

తప్పిపోయిన బాలుడిని బంధువులకు అప్పగించిన పోలీసులు
బాలుడిని బంధువులకు అప్పగిస్తున్న పోలీసులు

ముద్దనూరు అక్టోబరు 23: హాస్టల్‌ నుంచి పారిపోయి అక్క ఇంటికి ముద్దనూరుకు వచ్చిన బాలుడు ఇల్లు కనుక్కోలేక తిరు గుతుండగా పోలీసులు గుర్తించి బాలుడిని బంధువులకు అప్పగిం చారు. ఎస్‌ఐ ధనుంజయుడు సమాచారం మేరకు వివరాలిలా ఉన్నాయి. కర్నూలు జిల్లా చాగలమర్రి మండలం మురాలపల్లి తాండాకు చెందిన మీటియనాయక్‌ కుమారుడు బుక్కే బాలాజీనాయక్‌ (12) ఆళ్లగడ్డలోని గిరిజన సంక్షేమ వసతి గృహంలో 7వ తరగతి చదువుతున్నాడు. దసరా సెలవులు ముగిసిన తరువాత తల్లిదండ్రులు ఈనెల 21వ తేదీ ఆళ్లగడ్డలోని వసతి గృహంలో బాలుడిని విడిచిపెట్టారు. అయితే అతడు హాస్టల్‌ అధికారులకు తెలియకుండా ముద్దనూరులో ఉన్న అక్క ఇంటికి శనివారం బయలుదేరి వచ్చాడు. ఇల్లు కనుక్కోలేక దారి తప్పి తిరుగుతూ ఏడుస్తుండగా పోలీసులు వివరాలు తెలుసుకుని బంధువులకు అప్పగించినట్లు ఎస్‌ఐ తెలిపారు.

 

Updated Date - 2021-10-24T05:00:22+05:30 IST