సామాజిక సేవలో పోలీసులు

ABN , First Publish Date - 2020-12-01T06:22:22+05:30 IST

కమ్యూనిటీ పోలీసింగ్‌లో భాగంగా ఎస్పీ విష్ణు వారియర్‌ ఆదేశాల మేరకు నిర్మల్‌ పోలీసులు సామాజిక సేవలో పాల్గొన్నారు.

సామాజిక సేవలో పోలీసులు
రోడ్డు మరమ్మతులు చేస్తున్న పోలీసులు

నిర్మల్‌ కల్చరల్‌, నవంబరు 30 : కమ్యూనిటీ పోలీసింగ్‌లో భాగంగా ఎస్పీ విష్ణు వారియర్‌ ఆదేశాల మేరకు నిర్మల్‌ పోలీసులు సామాజిక సేవలో పాల్గొన్నారు. సోమవారం రోడ్డు ప్రమాదాల నివారణలో భాగంగా జాతీయ రహదారి 65 రోడ్డు పైన గుంతలను పూడ్చారు. చిట్యాల బ్రిడ్జి రోడ్డుతో పాటు తల్వేదక్రాస్‌ రోడ్డు వరకు ఈ పనులు చేపట్టారు. సీసీ కెమెరా ఏర్పాటు కోసం ముందుకు రావాలని దాబా యజమానికి ప్రేరణ కల్పించారు.  ఈ కార్యక్రమంలో నిర్మల్‌ రూరల్‌  ఎస్‌.ఐ మిధున్‌ చక్రవర్తితో పాటు పోలీసులు పాల్గొన్నారు. 


Updated Date - 2020-12-01T06:22:22+05:30 IST