టీడీపీ నేత చినరాజప్పను అడ్డుకున్న పోలీసులు

ABN , First Publish Date - 2021-09-17T03:54:07+05:30 IST

టీడీపీ నేత చినరాజప్పను అడ్డుకున్న పోలీసులు

టీడీపీ నేత చినరాజప్పను అడ్డుకున్న పోలీసులు

తూర్పుగోదావరి: ఏపీ ప్రభుత్వంపై టీడీపీ మాజీ ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప విమర్శలు గుప్పించారు. పోలీసుల తీరుపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పెద్దాపురం రైతులకు మద్దతుగా తెలుగుదేశం పార్టీ చేపట్టిన రైతుకోసం తెలుగుదేశం" కార్యక్రమాన్ని పోలీసుల సహాయంతో ప్రభుత్వం అడుగడుగునా అడ్డుకుందని మండిపడ్డారు. సామర్లకోటలో టీడీపీ నేత, ఎమ్మెల్యే చినరాజప్ప ఆధ్వర్యంలో తలపెట్టిన ట్రాక్టర్ల ర్యాలీని బారికేడ్లు అడ్డుపెట్టి పోలీసులు అడ్డుకున్నారు. సీఎం జగన్ అరకొర రుణమాఫీతో రైతులకు తీవ్ర అన్యాయం చేస్తున్నారని ఆయన విమర్శించారు. రైతుల కోసం టీడీపీ చేపట్టిన కార్యక్రమాన్ని కోవిడ్ నిబంధనలతో పోలీసులు అడ్డుకుంటున్నారని చినరాజప్ప మండిపడ్డారు.


వాస్తవాలు బయటకు వస్తాయన్న భయంతోనే టీడీపీ కార్యక్రమాన్ని పోలీసులతో ప్రభుత్వం అడ్డుకుంటుందని, వైసీపీ కార్యక్రమాలకు లేని కోవిడ్ నిబంధనలు టీడీపీ కార్యక్రమాలకు ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చినరాజప్ప డిమాండ్ చేశారు. కౌలు రైతులను ఆదుకోవాలని, ఎరువులు, విత్తనాలు బ్లాక్ మార్కెట్‌కు తరలుతున్నాయని, ఐకెపి సెంటర్లు వైసీపీ నాయకుల కంట్రోల్‌సో ఉన్నాయని ఆయన విమర్శలు గుప్పించారు. ధాన్యానికి మద్దతు ధరలేదని, పెండింగులో ఉన్న ధాన్యం బిల్లులను వెంటనే విడుదల చేయాలని, ఇప్పటికైనా రైతులను ఆదుకోవాలని రాజప్ప డిమాండ్ చేశారు.

Updated Date - 2021-09-17T03:54:07+05:30 IST