రెమ్‌డిసివిర్‌ ముఠాల అరెస్టు

ABN , First Publish Date - 2021-05-11T06:25:10+05:30 IST

కరోనా బాధితులకు ఇవ్వాల్సిన రెమ్‌డిసివిర్‌ టీకాలను బ్లాక్‌ మార్కెట్‌కు తరలించి, సొమ్ము చేసుకుంటున్న 11 మందితో కూడిన రెండు ముఠాలను నగరంలోని వనటౌన పోలీసులు అరెస్టు చేశారు. పట్టుబడిన వారి నుంచి 16 రెమ్‌డిసివిర్‌ ఇంజక్షన్లు, రూ.94 వేల నగదు, ఏడు సెల్‌ఫోన్లను స్వాదీనం చేసుకున్నారు.

రెమ్‌డిసివిర్‌ ముఠాల అరెస్టు

11 మంది నిందితులు కటకటాల్లోకి..

16 రెమ్‌డిసివిర్‌ టీకాలు, రూ.94 వేల నగదు,

 ఏడు సెల్‌ఫోన్ల స్వాధీనం


అనంతపురం క్రైం, మే10: కరోనా బాధితులకు ఇవ్వాల్సిన రెమ్‌డిసివిర్‌ టీకాలను బ్లాక్‌ మార్కెట్‌కు తరలించి, సొమ్ము చేసుకుంటున్న 11 మందితో కూడిన రెండు ముఠాలను నగరంలోని వనటౌన పోలీసులు అరెస్టు చేశారు. పట్టుబడిన వారి నుంచి 16 రెమ్‌డిసివిర్‌ ఇంజక్షన్లు, రూ.94 వేల నగదు, ఏడు సెల్‌ఫోన్లను స్వాదీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను డీఎస్పీ వీరరాఘవరెడ్డి తన కార్యాలయంలో సీఐ ప్రతాపరెడ్డితో కలిసి సోమవారం వెల్లడించారు. నార్పల మండలం కేశేపల్లికి చెందిన రాజేష్‌, యల్లనూరు మండలం కొడవండ్లపల్లి వాసి కిశోర్‌నాయుడు, నగరంలోని ఆదర్శనగర్‌కు చెందిన నరేంద్ర కొంత కాలంగా ప్రభుత్వ సర్వజనాస్పత్రిలో ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులుగా పనిచేస్తున్నారు. భారతి, సుకన్య సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రిలో ఔట్‌ సోర్సింగ్‌ ప్రాతిపదికన పనిచేస్తున్నారు. వీరితో పాటు నార్పల మండలం మాలవాండ్లపల్లికి చెందిన సత్యనారాయణ, నగరంలోని రామచంద్రనగర్‌ వాసి విశ్వనాథరెడ్డి నగరంలో మెడికల్‌ మార్కెటింగ్‌ విభాగంతోపాటు నర్సింగ్‌ హోంలలో ప్రైవేట్‌ ఉద్యోగులుగా పనిచేస్తుండటంతో వీరందరికీ పరియచం ఏర్పడింది. కరోనా విలయతాండవం నేపథ్యంలో రెమ్‌డిసివిర్‌ టీకాకి మార్కెట్‌లో డిమాండ్‌ పెరిగింది. ఇదే అదనుగా భావించి, వీరందరూ ముఠాగా ఏర్పడి ప్రభుత్వం ఆయా ఆస్పత్రులకు సరఫరా చేసిన రెమ్‌డిసివీర్‌ ఇంజక్షన్లను పక్కదారి పటించి, బ్లాక్‌ మార్కెట్‌లో ఒక్కొక్కటి రూ.20వేల నుంచి 30 వేలకు విక్రయించి, సొమ్ము చేసుకోవాలని భావించారు. పథకం ప్రకారం మూడు రోజుల కిందట ముఠాలోని ఇద్దరు వ్యక్తులు నగరంలోని కమలానగర్‌లో బ్లాక్‌ మార్కెట్లో ఇంజక్షన్లను విక్రయిస్తుండటంతో వనటౌన పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి 14 రెమ్‌డిసివిర్‌ టీకాలను స్వాధీనం చేసుకున్నారు. లోతుగా విచారణ చేసి, ఇందులో పాత్ర ఉన్న ఐదుగురు ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులను అరెస్టు చేసి, ఏడుగురికి చెందిన సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రిలో ఎంఎనఓలుగా పనిచేస్తున్న షేక్‌ మన్సూర్‌, షేక్‌ షామీర్‌ కలిసి ఆస్పత్రికి ప్రభుత్వం సరఫరా చేసిన రెండు రెమ్‌డిసివిర్‌ టీకాలను అపహరించి, నగరంలోని లైఫ్‌ కేర్‌ మెడికల్స్‌ యజమాని గంగాచారి, శ్రీలక్ష్మి మెడికల్స్‌ స్టోర్స్‌ యజమాని అంబటి వెంకటేశ్వర ప్రసాద్‌ కలిసి బ్లాక్‌లో సోమవారం సప్తగిరి సర్కిల్‌ సమీపాన విక్రయిస్తుండగా పోలీసులు అరెస్టు చేశారు. వీరి నుంచి రెండు టీకాలతోపాటు రూ.94 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుల్లో పట్టుబడిన ఐదుగురు ఔట్‌సోర్సింగ్‌, ఇద్దరు ఎంఎనఓలను ఉద్యోగాల నుంచి తొలగించాలని సంబంధిత ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపినట్లు డీఎస్పీ వివరించారు.


Updated Date - 2021-05-11T06:25:10+05:30 IST