లోకేష్‌ను పోలీస్‌స్టేషన్ల చుట్టూ తిప్పుతున్న పోలీసులు

ABN , First Publish Date - 2021-08-17T00:18:42+05:30 IST

టీడీపీ నేత నారా లోకేష్ పట్ల పోలీసులు అనుచితంగా ప్రవర్తిస్తున్నారు. బెయిల్ పేరుతో పోలీస్‌స్టేషన్ల చుట్టూ లోకేష్‌ను పోలీసులు తిప్పుతున్నారు.

లోకేష్‌ను పోలీస్‌స్టేషన్ల చుట్టూ తిప్పుతున్న పోలీసులు

గుంటూరు: టీడీపీ నేత నారా లోకేష్ పట్ల పోలీసులు అనుచితంగా ప్రవర్తిస్తున్నారు. బెయిల్ పేరుతో పోలీస్‌స్టేషన్ల చుట్టూ లోకేష్‌ను తిప్పుతున్నారు. ప్రత్తిపాడు పోలీస్‌స్టేషన్ నుంచి లోకేష్‌ను పోలీసులు బయటికి తీసుకొచ్చారు. ఆయనను గుంటూరుకు తరలించారు. ప్రత్తిపాడు నుంచి గుంటూరుకు లోకేష్‌ కాన్వాయ్‌ బయలుదేరింది. అంతకుముందు ఆయన టీడీపీ నేతల అరెస్ట్‌పై నిరసన తెలిపారు. పోలీసుల తీరుతో మధ్యాహ్న భోజనాన్ని నిరాకరించారు. ఉదయం నుంచి అన్నం ముట్టలేదని టీడీపీ నేతలు చెబుతున్నారు. విద్యార్థిని రమ్య కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లిన లోకేష్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. లోకేష్‌తో పాటు టీడీపీ నేతలు ధూళిపాళ్ల, ఆలపాటి రాజా, నక్కా ఆనందబాబును అరెస్ట్ చేశారు. లోకేష్‌ను విడుదల చేయాలని రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ కార్యకర్తలు ఆందోళనలు చేస్తున్నారు.



Updated Date - 2021-08-17T00:18:42+05:30 IST