పోలీస్‌ నజర్‌..!

ABN , First Publish Date - 2021-12-07T04:39:28+05:30 IST

జిల్లావ్యాప్తంగా కొంతకాలంగా సివిల్‌ పంచాయితీలు, ఇతర అసాంఘిక కార్యకలాపాలు జోరుగా సాగుతున్న వ్యవహారంపై పోలీసులు సీరియస్‌గా దృష్టి సారిస్తున్నారు. ఎస్పీ ప్రవీణ్‌ కుమార్‌ ఆధ్వర్యంలో జిల్లావ్యాప్తంగా బెదిరింపులకు పాల్పడుతూ సివిల్‌ పంచాయితీలు నిర్వహించే వారిపై నజర్‌ పెడుతున్నారు. జిల్లాలోని అన్ని పోలీస్‌ స్టేషన్‌లలో ఇప్పటికే రౌడీషీటర్‌లుగా నమోదైన వారందరికీ వార్నింగ్‌ ఇస్తున్నారు. కొంతమంది సివిల్‌ పంచాయితీల్లో జోక్యం చేసు కోవడం, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం పేరిట బెదిరింపులకు పా ల్పడుతున్నట్లు ఫిర్యాదులు అందుతున్నాయి.

పోలీస్‌ నజర్‌..!
అవగాహన కల్పిస్తున్న పోలీసులు

జిల్లాలో సివిల్‌ పంచాయితీలు, బెదిరింపులకు పాల్పడే వారిపై దృష్టి 

రౌడీషీటర్లకు వార్నింగ్‌  

ప్రవర్తన మార్చుకుంటే రౌడీషీట్‌ ఎత్తివేతకు పోలీసుల ప్రత్యేక హామీ

నిర్మల్‌, డిసెంబరు 6 (ఆంధ్రజ్యోతి): జిల్లావ్యాప్తంగా కొంతకాలంగా సివిల్‌ పంచాయితీలు, ఇతర అసాంఘిక కార్యకలాపాలు జోరుగా సాగుతున్న వ్యవహారంపై పోలీసులు సీరియస్‌గా దృష్టి సారిస్తున్నారు. ఎస్పీ ప్రవీణ్‌ కుమార్‌ ఆధ్వర్యంలో జిల్లావ్యాప్తంగా బెదిరింపులకు పాల్పడుతూ సివిల్‌ పంచాయితీలు నిర్వహించే వారిపై నజర్‌ పెడుతున్నారు. జిల్లాలోని అన్ని పోలీస్‌ స్టేషన్‌లలో ఇప్పటికే రౌడీషీటర్‌లుగా నమోదైన వారందరికీ వార్నింగ్‌ ఇస్తున్నారు. కొంతమంది సివిల్‌ పంచాయితీల్లో జోక్యం చేసు కోవడం, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం పేరిట బెదిరింపులకు పా ల్పడుతున్నట్లు ఫిర్యాదులు అందుతున్నాయి. దీంతో రౌడీ షీటర్‌లను కట్టడి చేయడమే కాకుండా వారందరికీ హెచ్చరికలతో కూడిన కౌ న్సెలింగ్‌లు చేపట్టారు. మూడు రోజుల నుంచి జిల్లాలోని అన్ని పో లీస్‌ స్టేషన్‌ల పరిధిలో రౌడీషీటర్‌లను పిలిపించి కౌన్సెలింగ్‌ ఇస్తు న్నారు. చట్టవిరుద్ధమైన కార్యకలాపాల్లో పాల్గొంటే కఠిన చర్యలు తప్పవంటూ హెచ్చరిస్తూనే.. మరోవైపు ప్రవర్తన మార్చుకుంటే రౌడీషీట్‌ను ఎత్తివేసేందుకు సిద్ధమేనంటూ హామీనిస్తున్నారు. ఇప్పటికే పలువురు రౌడీషీటర్‌లు తమ ప్రవర్తనను మార్చుకొని సాధారణ జీవితాన్ని గడుపుతుండగా, కొంతమందిపైనే అనేక ఫి ర్యాదులు అందుతున్నాయి. ఇలా ఫిర్యాదులు అందుతున్న వా రిని పిలిపించి వారికి గట్టి వార్నింగ్‌లు జారీ చేస్తున్నారు.

జిల్లాలో మొత్తం 457 మంది రౌడీ షీటర్‌లు..

జిల్లాలో మొత్తం 457 మంది రౌడీ షీటర్‌లుగా పోలీస్‌స్టేషన్‌లలో నమోదై ఉన్నారు. గతంలో ప్రవర్తన మార్చుకున్న వారిపై దానిని ఎత్తివేశారు. మత ఘర్షణలు, బెదిరింపులు, దాడులు, ఇత రత్రా కార్యకలాపాలతో పాటు అసాంఘిక కార్యకలాపాల్లో పాల్గొంటున్న వారిపై కేసులు నమోదు చేసి వారిపై రౌడీషీట్‌ తెరిచారు. ఇటీవలే పలు పోలీస్‌స్టేషన్‌ల పరిధిలో రౌడీ షీటర్‌లపై తరచూ ఫిర్యాదులు వస్తుండడంతో పోలీసులు ఆ దిశగా అప్రమత్తమయ్యారు. సమస్య తీవ్రం కాకముందు పకడ్బందీ చర్యలు చేపట్టాలన్న ఉద్దేశంతో పోలీసులు రంగంలోకి దిగారు. ఇందులో భాగంగానే మూడు, నాలుగు రోజుల నుంచి ఆయా పోలీస్‌ స్టేషన్‌ల పరిధిలో ముమ్మరంగా వార్నింగ్‌లు, కౌన్సెలింగ్‌లు కొనసాగుతున్నాయి. దీంతో పాటు మట్కా, పేకాట నిర్వాహకులపై కూడా దృష్టి పెడుతున్నారు. వీరిలో కొంతమందిపై ఇప్పటికే రౌడీషీట్‌లు కూడా పోలీసులు తెరిచారు. వీరికి సైతం కౌన్సెలింగ్‌లు నిర్వహిస్తూ చట్టవిరుద్ధ కార్యకలాపాలకు దూరంగా ఉం డాలంటూ హెచ్చరిస్తున్నారు. 

నిర్మల్‌, భైంసా పట్టణాల్లో ఎక్కువగా.. 

జిల్లాలోని అన్ని పోలీస్‌ స్టేషన్‌ల పరిధిలో మొత్తం 457 మంది రౌడీషీటర్‌లు ఉన్నట్లు పోలీసు అధికారులు వెల్లడిస్తున్నారు. నిర్మల్‌, భైంసా పట్టణాల్లో వీరి సంఖ్య ఎక్కువగా ఉండడం గమనార్హం. ఆయా పోలీస్‌ స్టేషన్‌ల ఎస్‌ఐలు రౌడీ షీటర్‌లను ఒకే చోటుకు పిలిపించి వా రందరికీ వ్యక్తిగత కౌన్సెలింగ్‌లతో పాటు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఒక్కో రౌడీ షీటర్‌పై ఇ ప్పటి వరకు ఉన్న కేసుల వివరాలను వారికి మరోసారి వివరిస్తున్నారు. దీంతో పాటు తమకు అం దిన ఫిర్యాదుల వివరాలను తెలుపుతున్నారు. ఇక నుంచి చట్టవిరుద్ధ కార్యకలాపాల్లో పాల్గొనడం, ఎలాంటి పంచాయితీల్లో జోక్యం చేసుకొని బెదిరింపులు దాడులకు పాల్పడడం చేస్తే మరిన్ని క ఠిన చర్యలు తీసుకోక తప్పదన్న సంకేతాలు అం దిస్తున్నారు. 

ప్రవర్తన మార్చుకుంటే రౌడీషీట్‌ ఎత్తివేతకు హామీ..

ప్రస్తుతం తమ పోలీస్‌ స్టేషన్‌ల పరిధిలో నమోదై ఉన్న రౌడీషీటర్లకు సానుకూల దృక్పథమైన కౌన్సెలింగ్‌ ఇస్తున్నారు. ప్రవర్తన మార్చుకుంటే రౌడీషీట్‌లను ఎత్తివేస్తామన్న భరోసా కల్పిస్తున్నారు. సివిల్‌ పంచాయితీలు, దాడుల వ్యవహారాలతో పాటు మట్కా, పేకాట జూ దం వ్యవహారాల్లో పాలు పంచుకోవద్దంటూ సూచిస్తున్నారు. ఒక్కో రౌడీ షీటర్‌కు సంబంధించి పోలీసులు వివరాలను సేకరించారు. వీటిని వారికి చెబుతూ ప్రవర్తన మార్చుకోవాలని కోరుతున్నారు. కేసుల ఎత్తివేత బాధ్యత తమదేనన్న నమ్మకాన్ని కల్పించే ప్రయత్నం చేస్తున్నారు.

Updated Date - 2021-12-07T04:39:28+05:30 IST