Advertisement
Advertisement
Abn logo
Advertisement

విలేకరులపై కానిస్టేబుల్‌ దురుసు ప్రవర్తన

  • ఫొటోలు, వీడియో తీసి కేసు పెడతామంటూ బెదిరింపు


హైదరాబాద్/అడ్డగుట్ట : లాక్‌డౌన్‌లో బయటకు రావద్దని మీకు ప్రత్యేకంగా చెప్పాలా, ఫొటోలు తీసి కేసులు పెడతామంటూ ఓ కానిస్టేబుల్‌ కవరేజ్‌కి వెళ్లిన విలేకరులపై దురుసుగా ప్రవర్తించాడు. అడ్డగుట్టలో కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో భోజన ప్యాకెట్లు పంపిణీ చేస్తున్నారు. కార్యక్రమ కవరేజీకి వెళ్లిన పలు పత్రికలు, ఎలక్ట్రానిక్ మీడియా విలేకరులపై(ఆంధ్రజ్యోతి కాదు) తుకారంగేట్‌ కానిస్టేబుల్‌ వడ్ల వీరేశ్‌కుమార్‌ దురుసుగా ప్రవర్తించాడు. కార్యక్రమం పూర్తికాగానే విలేకరులు ఓ చోట నిలబడి మంచినీళ్లు తాగుతుండగా కానిస్టేబుల్‌ ఫొటోలు, వీడియో తీస్తున్నాడు. సార్‌.. తాము విలేకరులమని వారు చెప్పినా ఆయన వినిపించుకోకుండా ఫొటోలు తీసి కేసులు పెడతామంటూ బెదిరించా డు. ఈ ఘటన సామాజిక మాధ్యమాల్లో వైరలవుతోంది. 

Advertisement
Advertisement