దీపావళి రాత్రి పోలీస్ ఆఫీసర్ బీరు పార్టీ.. ఇంట్లో బార్ గర్ల్స్ చేత డాన్సులు.. హింసాత్మకంగా మారిన పార్టీ.. అసలేం జరిగిందంటే..

ABN , First Publish Date - 2021-11-14T15:27:44+05:30 IST

ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఘాజియాబాద్‌లో ఒక పోలీస్ కానిస్టేబుల్ తన సీనియర్ పోలీస్ అధికారిపై ఫిర్యాదు చేశాడు. తనను అకారణంగా చితకబాదాడని, చంపుతానని బెదిరిస్తున్నాడని ఫిర్యాదులో పేర్కొన్నాడు. దీంతో పోలీసు ఉన్నతాధికారులు ఈ కేసులో జోక్యం చేసుకొని విచారణ జరిపారు. విచారణలో సదరు పోలీస్ అధికారి గురించి నిజాలు...

దీపావళి రాత్రి పోలీస్ ఆఫీసర్ బీరు పార్టీ.. ఇంట్లో బార్ గర్ల్స్ చేత డాన్సులు.. హింసాత్మకంగా మారిన పార్టీ.. అసలేం జరిగిందంటే..

ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఘాజియాబాద్‌లో ఒక పోలీస్ కానిస్టేబుల్ తన సీనియర్ పోలీస్ అధికారిపై ఫిర్యాదు చేశాడు. తనను అకారణంగా చితకబాదాడని, చంపుతానని బెదిరిస్తున్నాడని ఫిర్యాదులో పేర్కొన్నాడు. దీంతో పోలీసు ఉన్నతాధికారులు ఈ కేసులో జోక్యం చేసుకొని విచారణ జరిపారు. విచారణలో సదరు పోలీస్ అధికారి గురించి నిజాలు తెలుసుకొని అధికారులు సైతం సిగ్గుపడుతున్నారు.


ఘాజియాబాద్‌లోని మసూరి పోలీస్ స్టేషన్ సిఐగా పని చేస్తున్న జీతేంద్ర కుమార్ దీపావళి రోజు తన మిత్రుడు కుల్దీప్ శర్మ ఫ్లాట్‌లో డాన్స్ పార్టీకి వెళ్లాడు. అక్కడ తప్పతాగి బార్ గర్ల్స్‌తో చిందులు కూడా వేశాడు. అతనితో పాటు మరో ఇద్దరు స్నేహితులు కూడా ఉన్నారు. పార్టీలో మందు అయిపోవడంతో కానిస్టేబుల్ ఇమ్రాన్‌కి ఫోన్ చేసి ఇంకా మందు, చికెన్ తీసుకురావాలని సిఐ జీతేంద్ర చెప్పాడు. దీంతో కానిస్టేబుల్ ఇమ్రాన్ తన సీనియర్ చెప్పినట్లు పార్టీకి మందు బాటిళ్లు, చికిన్ పట్టుకుపోయాడు. ఇమ్రాన్ అక్కడికి చేరేసరికి ఒక బార్ గర్ల్ గాయాలతో పరిగెత్తుకుంటూ వచ్చి కిందపడిపోయింది. ఇమ్రాన్ ఆమెను పైకి లేపాడు. ఆ బార్ గర్ల్ ముఖంలో భయంతో చెమటలు కనిపిస్తున్నాయి. ఏం జరిగింది.. అని ఇమ్రాన్ ఆమెను అడిగాడు. 


ఇంతో ఎదురుగా జీతేంద్ర, అతని స్నేహితులు ఆ బార్ గర్ల్‌ని కొట్టడానికి వచ్చారు. ఇమ్రాన్ వారిని అడ్డుకోవడంతో అతడిని కూడా చితకబాదారు. ఆ బార్ గర్ల్‌ని తీసుకెళ్లి బాగా కొట్టారు. ఆ తరువాత ఇమ్రాన్ ఎలాగోలా లేచి ఫ్లాట్ లోపలికి వెళ్లాడు. అక్కడ ఇద్దరు బార్ గర్ల్స్ రక్తసిక్తమై పడి ఉన్నారు. వారిద్దరినీ ఆస్పత్రికి చేర్చాడు. మరుసటి రోజు ఆస్పత్రిలో కోలుకున్న ఆ బార్ గర్ల్స్ పోలీసులకు జరిగిన విషయం చెప్పారు. 


తమను ఆ పార్టీలో డాన్స్ చేసేందుకు జీతేంద్ర పిలిచాడని, పార్టీలో డాన్స్ చేస్తూ ఉండగా జీతేంద్ర, కుల్దీప్ మిగతా ఇద్దరు స్నేహితులు వారితో చాలా అసభ్యకరంగా ప్రవర్తించారని చెప్పారు. ఆ ఇద్దరు అమ్మాయిలను జీతేంద్ర స్నేహితులు తమ కోరికలు తీర్చమని అడగగా వారు నిరాకరించడంతో వారిద్దరినీ కొట్టారని అన్నారు. అక్కడి నుంచి ఒక అమ్మాయి తప్పించుకొని పారిపోతున్న సమయంలో కానిస్టేబుల్ ఇమ్రాన్ వచ్చాడని తెలిపారు. 


కానిస్టేబుల్ ఇమ్రాన్ ఫిర్యాదు మేరకు సిఐ జీతేంద్ర, అతని స్నేహితులపై పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. ప్రస్తుతం సిఐ జీతేంద్ర కోర్టు నుంచి బెయిలుపై బయటివచ్చాడు. ఇమ్రాన్, ఆ ఇద్దరు బార్ గర్ల్స్ చెప్పినదంతా అబద్ధమని, కానిస్టేబుల్ ఇమ్రాన్ వారిద్దరినీ అక్కడికి తీసుకువచ్చాడని జీతేంద్ర వాంగ్మూలం ఇచ్చాడు.


Updated Date - 2021-11-14T15:27:44+05:30 IST