అత్యవసరమైతే పోలీసు ఈ పాస్‌

ABN , First Publish Date - 2021-05-11T05:07:22+05:30 IST

రాష్ట్రంలో కర్ఫ్యూ పటిష్టంగా అమలవుతున్న తరుణంలో ఎవరైనా అత్యవసర పనులపై ఇతర జిల్లాలకు వెళ్లాల్సి వస్తే వారికి ఈ పాస్‌ సౌకర్యం కల్పించనున్నట్టు డీజీపీ ఆదేశాలు జారీ చేశారని ఎస్పీ రాజకుమారి తెలిపారు. ఈ మేరకు సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు.

అత్యవసరమైతే పోలీసు ఈ పాస్‌
ఎస్పీ రాజకుమారి

ఎస్పీ రాజకుమారి 

 విజయనగరం క్రైం, మే 10: రాష్ట్రంలో కర్ఫ్యూ పటిష్టంగా అమలవుతున్న తరుణంలో ఎవరైనా అత్యవసర పనులపై  ఇతర జిల్లాలకు వెళ్లాల్సి వస్తే వారికి ఈ పాస్‌ సౌకర్యం కల్పించనున్నట్టు డీజీపీ ఆదేశాలు జారీ చేశారని ఎస్పీ రాజకుమారి తెలిపారు. ఈ మేరకు సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. జిల్లాల వారీగా పాస్‌ల కోసం వాట్సాప్‌ నెంబర్లు, మెయిల్‌ ఐడీ వివరాలను తెలిపారు. తగిన కారణాలు, ఆధారాలు చూపించి ఈ పాస్‌కు దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. కర్ఫ్యూ అమల్లో  ఉన్న దృష్ట్యా వైద్యం, స్వచ్ఛంద సేవ, ప్రభుత్వ విధులు, అత్యవసర సేవలకు వెళ్లేవారికి పోలీసుశాఖ ద్వారా రవాణా పాసులు జారీ చేస్తున్నట్టు తెలిపారు. ఇతర జిల్లాల పరిధిలోకి వెళ్లాల్సి వస్తే అక్కడి ఎస్పీకి అనుమతి కోసం దరఖాస్తు చేసుకోవాలని కోరారు. వేరే రాష్ట్రానికి వెళ్లాల్సి వస్తే సదరు వ్యక్తికి సంబంధించిన జిల్లా ఎస్పీ ద్వారా డీఐజీ కార్యాలయానికి దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. ఆ వివరాలు పరిశీలించి, ఆ రాష్ట్రాలను సంప్రదించి, డీఐజీ కార్యాలయం అనుమతి ఇస్తుందని వివరించారు. పాస్‌ అవసరమైన వ్యక్తులు చిరునామా, ఆధార్‌, ప్రయాణించే వాహనం నెంబరు, ప్రయాణికుల సంఖ్య, ఎక్కడి నుంచి ఎక్కడకు వెళ్తారన్న వివరాలు సమర్పించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. పాస్‌కోసం ఎస్పీ వాట్సాప్‌, ఈ మెయిల్‌కు దరఖాస్తు చేసుకోవాలని కోరారు. దరఖాస్తులు పరిశీలించాక వారి మొబైల్‌ నెంబర్లకు పోలీసులు అనుమతి పత్రం పంపిస్తారని తెలిపారు. ఈ పాస్‌ తీసుకున్నవారు గుర్తింపు కార్డు ఉంచుకోవాలని కోరారు. సెల్‌ నెంబరు 99892 07326 వాట్సాప్‌నకు, మెయిల్‌ ఐడీ: ఎస్పీఓఎఫ్‌విజడ్‌ఎం ఎట్‌ది రేట్‌ ఆఫ్‌ జీమెయిల్‌ డాట్‌ కామ్‌నకు పంపించాలని కోరారు.



Updated Date - 2021-05-11T05:07:22+05:30 IST