Advertisement
Advertisement
Abn logo
Advertisement

పోలీసుల పనితీరు భేష్‌ : డీఎస్పీ

వట్‌పల్లి, డిసెంబరు 6 : శాంతిభద్రతల పరిరక్షణలో వట్‌పల్లి పోలీసుల పనితీరు భేష్‌ అని సంగారెడ్డి డీఎస్పీ బాలాజీ కితాబిచ్చారు. సోమవారం ఆయన పోలీ్‌సస్టేషన్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కవాతులో చక్కటి ప్రతిభ కనబరిచిన కానిస్టేబుల్‌ నర్సింహులుకు నగదు పారితోషికాన్ని అందజేశారు. పోలీ్‌సస్టేషన్‌ పరిధిలోని పలు నేరాల కేసులకు సంబంధించిన రికార్డులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం పోలీస్‌స్టేషన్‌ ఆవరణలో మొక్కలను నాటారు. ఆయన వెంట జోగిపేట సీఐ బి.శ్రీనివాస్‌ తదితరులు ఉన్నారు. 

Advertisement
Advertisement