Abn logo
Sep 20 2020 @ 01:53AM

జిల్లా వ్యాప్తంగా పోలీసుల ఆకస్మిక దాడులు

Kaakateeya

మూడు లక్షల గుట్కాతో పాటు 20 క్వింటాళ్ల రేషన్‌ బియ్యం పట్టివేత..

ఇసుక డంపుల సీజ్‌, ఏడుగురు పేకాట రాయుళ్ల అరెస్టు


జగిత్యాల టౌన్‌, సెప్టెంబరు 19 : జిల్లా ఇన్‌చార్జ్‌ ఎస్పీ కమలాసన్‌ రెడ్డి ఆదేశాల మేరకు శనివారం జగిత్యాల జిల్లా వ్యాప్తంగా పోలీసులు ఆకస్మీక తనిఖీలు నిర్వహించారు. మూడు లక్షల గుట్కాతో పాటు 20 క్వింటాళ్ల రేషన్‌ బియ్యం పట్టుకుని సీజ్‌ చేశారు. గోదావరి పరివాహక ప్రాంతాల్లో దాచిన ఇసుక డంపులను గుర్తించి సీజ్‌ చేశారు. ఏడుగురు పేకాట రాయుళ్ల అరెస్టు చేసి వారి వద్ద రూ. 17,990 స్వాధీనం చేసుకున్నారు. జగిత్యాల, మెట్‌పెల్లి పోలీస్‌ స్టేషన్ట పరిధిలో సీఐలు జ యేష్‌రెడ్డి, రవి కుమార్‌, ఎస్‌ఐ కిరణ్‌ కుమార్‌ తమ సిబ్బందిలో కిరా ణా, పాన్‌ షాపులు, ట్రాన్స్‌పోర్టుల్లో తనీఖీలు నిర్వహించగా జగిత్యాల లో రూ. 2,45,815 విలువ గల గుట్కా, మెట్‌పెల్లిలో రూ. 50 వేల వి లువ గల గుట్కా, మల్యాల మండలం కొండగట్టులో రూ. 10 వేల విలువగల గుట్కాను పట్టుకుని ముగ్గురు వ్యక్తులపై కేసు నమోదు చే శారు. అలాగే మల్యాల మండలంలో ఎనిమిది క్వింటాళ్ల రేషన్‌ బియ్యం, కోరుట్లలో 12 క్వింటాళ్ల రేషన్‌ బియ్యాన్ని సీజ్‌ చేసి ఇద్దరిపై పోలీ సులు కేసు నమోదు చేశారు. అలాగే కోరుట్ల మండలం నాగులపేట, రాయికల్‌ మండలం ఇటిక్యాలలో 51 ట్రాక్టర్ల ఇసుకను సీజ్‌ చేసి తహసీల్దార్‌ కార్యాలయాలకు తరలించారు. మల్లాపూర్‌ మండలం సిర్‌పూర్‌లో పోలీసులు  ఏడుగురు పేకాట రాయుళ్ల అరెస్టు చేసి వారి వద్ద రూ. 17,990 స్వాధీనం చేసుకుని కేసులు నమోదు చేశారు. ఈ సందర్భంగా ఇన్‌చార్జి ఎస్పీ కమలాసన్‌ రెడ్డి మాట్లాడుతూ అక్రమ కార్యకలాపాలపై ఇక నుంచిప్రత్యేక డ్రైవ్‌లు నిర్వహిస్తామని వివరిం చారు. ప్రభుత్వం నిషేందించిన వస్తువులను విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు.

Advertisement
Advertisement
Advertisement