కోడి పందేల స్థావరాలపై పోలీసుల దాడులు

ABN , First Publish Date - 2022-01-17T03:57:29+05:30 IST

మండలంలో దిందా, బూర్గుడ గ్రామాల్లో కోడిపందేలపై పోలీసులు దాడులు నిర్వహించి 11మందిపై కేసు నమోదు చేశారు. ఎస్సై సందీప్‌కుమార్‌ తెలిపిన వివరాల ప్రకారం.. దిందా గ్రామ సమీపంలో కోడి పందేల స్థారాలపై దాడులు నిర్వహించి నలుగురిని పట్టుకు న్నామన్నారు.

కోడి పందేల స్థావరాలపై పోలీసుల దాడులు
బాబాపూర్‌లో పట్టుబడ్డ నిందితులతో పోలీసులు

చింతలమానేపల్లి, జనవరి 16: మండలంలో దిందా, బూర్గుడ గ్రామాల్లో కోడిపందేలపై పోలీసులు దాడులు నిర్వహించి 11మందిపై కేసు నమోదు చేశారు. ఎస్సై సందీప్‌కుమార్‌ తెలిపిన వివరాల ప్రకారం.. దిందా గ్రామ సమీపంలో కోడి పందేల స్థారాలపై దాడులు నిర్వహించి నలుగురిని పట్టుకు న్నామన్నారు. వారినుంచి అయిదు కోడిపుంజులు, నాలుగుకత్తులు, రూ.44 వేల నగదు స్వాధీన పర్చు కున్నట్లు తెలిపారు. అలాగే బూర్గుడ శివారులో దాడులు నిర్వహించి ఏడుగురిని పట్టుకుని వారినుంచి నాలుగు కోడి పుంజులు, ఆరువేల నగదు స్వాధీన పర్చుకున్నట్లు తెలిపారు.

వాంకిడి: మండలంలోని కనర్‌గాం, నార్లపూర్‌ గ్రామ సమీపంలో పేకాట స్థావరాలపై దాడులు నిర్వహించి 9మందిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై డీకొండ రమేష్‌ పేర్కొన్నారు. శనివారం కనర్‌గాం గ్రామసమీపంలో పేకాటా డుతున్నట్లు వచ్చిన సమాచారం మేరకు డాడి చేశామన్నారు. ఈ దాడిలో నలుగురి వద్ద రూ.10,100రూపాయలు స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేశామ న్నారు. ఆదివారం నార్లపూర్‌ గ్రామంలో పేకాట స్థావరంపై దాడి చేసి రూ.10,010 స్వాధిన పర్చుకొని ఐదుగురిపై కేసు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు.

బెజ్జూరు: మండలంలో కోడి పందేల స్థావరాంపై ఆదివారం పోలీసులు దాడిచేసి పలు వురిపై కేసు నమోదు చేశారు. మండలంలోని రంగాపూర్‌, పాపనపేట గ్రామశివారులో కోడి పందేలు నిర్వహిస్తున్నారన్న సమాచారం మేరకు దాడులు నిర్వహించామన్నారు. ఈ దాడుల్లో రూ.4,100, మూడు కోడి పుంజులు లభ్యమైనట్లు ఎస్సై తెలిపారు. ఆత్రం గణేష్‌, రాజు, శ్రీనివాస్‌, బాలకృష్ణపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై పేర్కొన్నారు. 

రెబ్బెన: మండలంలోని జక్కులపల్లి పరిసరాల్లో కోడి పందేలు నిర్వహిస్తున్న స్థావరంపై ఎస్సై భవానీ సేన్‌ ఆధ్వర్యంలో దాడులు నిర్వహించారు. ఈ మేరకు ఏడుగురిని అదుపులోకి తీసుకుని వారి నుంచి రూ.9060 నగదు స్వాధీన పర్చుకున్నారు.

Updated Date - 2022-01-17T03:57:29+05:30 IST