Abn logo
Oct 23 2021 @ 00:30AM

దేశ రక్షణలో పోలీసుల సేవలు చిరస్మరణీయం

తుపాకీల గురించి వివరిస్తున్న ఎస్పీ మలికగర్గ్‌

ఎస్పీ మలికగర్గ్‌ 

విద్యార్థులకు ఆయుధాలపై అవగాహన కల్పించిన ఎస్పీ 


ఒంగోలు(క్రైం), అక్టోబరు 22: దేశ రక్షణ కోసం పోలీసులు చేస్తున్న త్యాగాలు అజరామమని, వారి సేవలను గుర్తు చేసుకునేందుకు పోలీసు అమరవీ రుల వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఎస్పీ మలికగర్గ్‌ తెలిపారు. ఇందులో భాగంగా ఈనెల 31వ తేదీ వర కు జిల్లావ్యాప్తంగా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తు న్నట్లు చెప్పారు. శుక్రవారం ఒంగోలులోని పోలీసు కల్యాణమండపంలో ఓపెన్‌హౌస్‌ కార్యక్రమాన్ని ఎ స్పీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లా డుతూ ఓపెన్‌హౌస్‌ ద్వారా పోలీసులు వినియోగిం చే ఆయుధాలు, పరికరాలు, వాహనాలను గురించి విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నట్లు చెప్పారు. ఈ నెల 24న గ్రేస్‌కేన్సర్‌ అవగాహన సదస్సు, ర్యాలీ జరుగుతుందన్నారు. కార్యక్రమంలో ఏఎస్పీ బి.రవి చంద్ర, డీఎస్పీలు యు.నాగరాజు, మల్లిఖార్జునరావు, కె.రాఘవేంద్రరావు, తాలుకా సీఐ శ్రీనివాసరెడ్డి, క మాండ్‌ కంట్రోల్‌ ఇన్‌స్పెక్టర్‌ బి.శ్రీనివాసరావు తదిత రులు పాల్గొన్నారు. అనంతరం స్థానిక ఎస్పీ కార్యాల యంలో జరిగిన సంక్షేమ దివాస్‌లో భాగంగా పోలీ సు అధికారులు, సిబ్బంది నుంచి వినతులు స్వీకరిం చారు. కార్యక్రమంలో ఎస్‌బి-2 ఇన్‌స్పెక్టర్‌ ఎన్‌.శ్రీకాం త్‌బాబు తదితరులు పాల్గొన్నారు.