Abn logo
Sep 26 2021 @ 02:31AM

బాయ్ ఫ్రెండ్ తుపాకీతో బెదిరిస్తున్నాడని 911కి కాల్ చేస్తే.. పోలీస్ వచ్చి ఆమెనే కాల్చారు.. కారణం ఏంటంటే..

తుపాకీతో తనపై ఓ యువకుడు తనపై దాడికి దిగాడంటూ దక్షిణ కాలిఫోర్నియాలోని ఓ యువతి 911కు కాల్ చేసి పోలీసులకు తెలపింది. పోలీసులు హుటాహుటిన అక్కడకు చేరుకున్నారు. ఇదే సమయంలో రెండో అంతస్థు బాల్కనీ నుంచి సరిగ్గా కింద ఓ బ్యాక్‌ప్యాక్(బ్యాగ్) పడి ఉంది. అది చూసిన పోలీసులు వెంటనే ఆమె అపార్ట్‌మెంటుకు చేరుకున్నారు. తలుపు వేసి ఉండడంతో పోలీసులు ఆమెను పిలిచి తలుపు తీసి బయటకు రావాలని హెచ్చరించారు. కానీ యువతి రాకపోవడం, లోపలి నుంచి ఏవో శబ్దాలు రావడంతో పోలీసులు తలుపులు పగలగొట్టి లోనికి ప్రవేశవించారు. ఈ క్రమంలోనే లోపల తుపాకీతో ఉన్న వ్యక్తి సదరు యువతి బ్యాయ్‌ఫ్రెండ్ అని పోలీసులకు తెలిసింది.

ఇంతలో ఆ యువకుడు పోలీసులపై కూడా గన్ గురి పెట్టాడు. దీంతో పోలీసులు అతడిపై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో యువతి చేతికి తీవ్రగాయమయింది. ప్రస్తుతం ఆమె పోలీసుల ప్రత్యేక పర్యవేక్షణలో చికిత్స పొందుతోంది. అయితే ప్రాణాపాయం లేదని తెలుస్తోంది. ఇక నిందితుడిపై అనేక సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే బెల్గమ్‌పై ఇప్పటికే క్రిమినల్ కేసులు నమోదు చేశారు. అతడిని జైలుకు తరలించారు. బెయిల్ కూడా రాకుండా అరెస్టు చేశారు. ఆయన తరపున అటార్జీ జనరల్ కోర్టులో వాదించనున్నారు. అయితే పోలీసుల కాల్పుల్లో బింఘమ్‌కు ఎలంటి గాయాలూ కాలేదు.

తాజా వార్తలుమరిన్ని...