మా కార్యక్రమాలకు రావాల్సిందే!

ABN , First Publish Date - 2021-10-22T05:19:45+05:30 IST

పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ ద్వారా పట్టణ పేద మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ఏర్పాటుచేసిన రిసోర్స్‌పర్సన్‌ (ఆర్పీ)లు ఇప్పుడు వైసీపీ కార్యకర్తలై పోతున్నారు. అధికార పార్టీ నాయకుల ఆదేశాలతో ఇష్టం ఉన్నా.. లేకున్నా అన్ని కార్యక్రమాల్లో పాల్గొనడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల కాలంలో ప్రభుత్వం నిర్వహించే ప్రతి కార్యక్రమంలో మెప్మా ఆర్పీలు పాత్ర తప్పనిసరైంది.

మా కార్యక్రమాలకు రావాల్సిందే!
కలెక్టరేట్‌ ఎదుట జనాగ్రహ దీక్షలో ఆర్‌పీలు (కింద కూర్చున్న వారు)

మెప్మా ఆర్పీలకు అధికార వైసీపీ నేతల ఆదేశాలు

  ఒంగోలులో జరిగిన జనాగ్రహ దీక్షలో పాల్గొన్న వైనం 

ఒంగోలు (కార్పొరేషన్‌), అక్టోబరు 21: పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ ద్వారా పట్టణ పేద మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ఏర్పాటుచేసిన రిసోర్స్‌పర్సన్‌ (ఆర్పీ)లు ఇప్పుడు వైసీపీ కార్యకర్తలై పోతున్నారు. అధికార పార్టీ నాయకుల ఆదేశాలతో ఇష్టం ఉన్నా.. లేకున్నా అన్ని కార్యక్రమాల్లో పాల్గొనడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల కాలంలో ప్రభుత్వం నిర్వహించే ప్రతి కార్యక్రమంలో మెప్మా ఆర్పీలు పాత్ర తప్పనిసరైంది. గతంలో పొదుపు సంఘాలను బలోపేతం చేయడం కోసం ప్రతిరోజు ఒక్కో గ్రూపుతో మాట్లాడి, వారికి ప్రభుత్వ పథకాల సద్వినియోగంపై వివరించేవారు. అయితే ప్రస్తుతం వారి రోజువారీ విధులు వదిలి అటు ప్రభుత్వ కార్యక్రమాల ప్రచారంతోపాటు ఇటు సీఎం సభలకు, మరోవైపు క్లీన్‌ ఆంధ్రప్రదేశ్‌ అవగాహన కార్యక్రమాల్లోను వీరు పాల్గొనాల్సి వస్తోంది. ప్రత్యేకించి టీడీపీకి పోటీగా వైసీపీ నేతలు రెండురోజుల పాటు జనాగ్రహ దీక్షలు చేపట్టారు. ఇది పూర్తిస్థాయిలో రాజకీయ కార్యక్రమం అయినప్పటికీ నగరంలోని ఆర్పీలు తప్పనిసరిగా వాటికి హాజరుకావాలని సీఎంఎం మెస్సేజ్‌లు పెట్టడంపై విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో నగరంలోని 176మంది ఆర్పీలు గురువారం ప్రకాశంభవనం వద్ద వైసీపీ ఆధ్వర్యంలో నిర్వహించిన జనాగ్రహ దీక్షలో ప్రత్యక్షమయ్యారు. ముందు వరుసలో రోడ్డుపై కూర్చున్నారు. దీనిపై కొందరు ఆర్పీలు ఆవేదన వ్యక్తం చేశారు.  

Updated Date - 2021-10-22T05:19:45+05:30 IST