Abn logo
Oct 21 2021 @ 22:15PM

పోలీసు అమరవీరుల త్యాగాలను స్ఫూర్తిగా తీసుకోవాలి

పోలీసు అమరవీరులకు సెల్యూట్‌ చేస్తున్న కలెక్టర్‌, జడ్పీ చైర్‌పర్సన్‌, ఎస్పీ

- ఎస్పీ వైవీఎస్‌ సుదీంద్ర

ఆసిఫాబాద్‌, అక్టోబరు 21: పోలీసు అమరవీరుల త్యాగాలను స్ఫూర్తిగా తీసుకోవాలని ఎస్పీ వైవీఎస్‌ సుదీంద్ర అన్నారు. గురువారం పోలీసుల అమర వీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా జిల్లాకేం ద్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పోలీసు అమర వీరులస్థూపం వద్ద కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌, జడ్పీ చైర్‌ పర్సన్‌ కోవలక్ష్మితో కలిసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ దేశం, రాష్ట్రం కోసం పోలీసు సిబ్బంది తమ ప్రాణాలను తాగ్యం చేశారని కొనియాడారు. సమాజంలో శాంతి భద్రత లను పరిరక్షించడంలో పోలీసు అధికారులు, సిబ్బంది ఎళ్లవేళలా కృషిచేస్తున్నారని కొనియాడారు. ఎస్పీ సుదీంద్ర మాట్లాడుతూ విధి నిర్వహణలో అమరులైన పోలీసులను ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాల న్నారు. సంక్షేమ ఫలాలు అందరికీ అందాలంటే శాంతి భద్రతలు ముఖ్యమన్నారు. ఏడాది కాలంలో విధి నిర్వ హణలో ప్రాణాలు కోల్పోయిన 377మంది సిబ్బందికి పేరుపేరునా నివాళులు అర్పిస్తున్నట్లు పేర్కొన్నారు. పోలీసుల అమరవీరుల స్థూపం వద్ద పుష్పగుచ్ఛం ఉంచి నివాళుల ర్పించారు. మౌనం పాటించారు. అనంతరం కరోనాతో మృతిచెందిన పోలీసు కుటుంబ సభ్యులతో ప్రత్యేకసమావేశం నిర్వ హించి వారిని అన్నివిధాల ఆదుకుం టామని హామీఇచ్చారు. ఈసంద ర్భంగా వారి కుటుంబసభ్యులకు గిఫ్టు ప్యాకేజీలు అందించారు. వ్యాసరచన పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు ప్రదా నం చేశారు. కార్యక్రమంలో డీఎ స్పీలు కరుణాకర్‌, శ్రీనివాస్‌. ఆర్‌ఎస్సై శేఖర్‌బాబు, ఎం శ్రీనివాస్‌, చంద్రశేఖర్‌, ప్రతాప్‌ పాల్గొన్నారు.

పోలీసు అమర వీరులకు నివాళులు..

పెంచికలపేట: పోలీసు అమర వీరు సంస్మరణ దినోత్సవంను పురస్కరించుకుని గురువారం సాయం త్రం పెంచికలపేట మండల కేంద్రంలో తహసీల్దార్‌ అనంతరాజ్‌, ఎస్సై రమేష్‌ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ సంద ర్భంగా  ప్రెస్‌క్లబ్‌ నుంచి ప్రధాన చౌరస్తా వరకు కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వ హించారు. అమర వీరులకు నివాళులు అర్పించారు. కార్యక్ర మంలో ఆర్‌ఐ గోపాల్‌, సర్పంచ్‌ రాజన్న, నాయకులు తిరుపతి, శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

పోలీసుల ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం..

కాగజ్‌నగర్‌: పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా పట్టణపోలీసుశాఖ ఆధ్వ ర్యంలో గురువారం రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ శిబిరాన్ని ఎస్పీ వైవీఎస్‌ సుదీంద్ర, పట్టణఇన్‌చార్జీ సీఐ రాజేంద్రప్రసాద్‌ ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ సమాజంలో పోలీసు వ్యవస్థపై గట్టి నమ్మకం పెరి గిందన్నారు. పట్టణంలోని వివిధ కాలనీలకు చెందిన యువకులు, పలువురు ఎస్సైలు, కానిస్టేబుళ్లు రక్త దానం చేశారు. రక్తదానం చేసిన ప్రతి ఒక్క రికి సీఐ గుర్తింపు పత్రాలను అందజేశారు. ఎస్సైలు వెంక టేష్‌, హనుమాండ్లు, సందీప్‌, కౌన్సిలర్లు, వివిధ వార్డు లకు చెందిన యువకులు, స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.