Abn logo
Aug 23 2021 @ 19:05PM

చంద్రుతండా హత్య కేసును ఛేదించిన పోలీసులు

ఖమ్మం: జిల్లాలో సంచలనం సృష్టించిన చంద్రుతండా హత్య కేసును పోలీసులు ఛేదించారు. పాత కక్షల నేపథ్యంలో ఈ ముగ్గురి హత్య జరిగినట్లు పోలీసులు తెలిపారు. మద్యంలో సైనైడ్‌ కలిపి ఇచ్చినట్టు నిందితులు ఒప్పుకున్నారు. ఈ కేసులో  నలుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. మరో నిందుతుడు పరారీలో ఉన్నాడు. హత్య కేసును ఛేదించిన పోలీసులను సీపీ విష్ణువారియర్‌ అభినందించారు.