Abn logo
Jul 16 2021 @ 22:52PM

వృద్ధురాలి హత్య కేసును ఛేదించిన పోలీసులు

విశాఖ: జిల్లాలో సంచలనం సృష్టించిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. సబ్బవరంలో జరిగిన వృద్ధురాలి హత్య కేసును పోలీసులు ఛేదించారు. నగల కోసమే వృద్ధురాలిని నిందితులు హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. బంగారాన్ని విక్రయించే క్రమంలో అది నకిలీదని తెలుసుకుని నిందితులు షాక్‌కు గురైనట్లు పోలీసులు పేర్కొన్నారు. బీరువాలో దాచిన బంగారాన్ని స్వాధీనం చేసుకుని నిందితులను పోలీసులు అరెస్టు చేసారు.