కేన్సర్‌ను జయించవచ్చు

ABN , First Publish Date - 2021-10-25T04:52:42+05:30 IST

ఆత్మవిశ్వాసంతో కేన్సర్‌ వ్యాధిని జయించ వచ్చని డీఎస్పీ కె.లతాకుమారి అన్నారు.

కేన్సర్‌ను జయించవచ్చు
పోలవరంలో పోలీసు సిబ్బంది 3కె రన్‌

పోలవరం, అక్టోబరు 24: ఆత్మవిశ్వాసంతో కేన్సర్‌ వ్యాధిని జయించ వచ్చని డీఎస్పీ కె.లతాకుమారి అన్నారు. పోలీస్‌ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలలో భాగంగా సీఐ అల్లు నవీన్‌ నరసింహమూర్తి ఆధ్వర్యంలో ఆదివారం 3కె రన్‌ నిర్వహించారు. డీఎస్పీ లతా కుమారి జెండా ఊపి 3 కె రన్‌ ప్రారంభించారు. ప్రధానంగా మహిళలు వివిధ రకాల కేన్సర్లతో బాధ పడుతున్నారని, అవగాహనతో ఎంతోమంది మహిళలు మనోదైర్యంతో ముం దుకు వెళుతున్నారని డీఎస్పీ అన్నారు. చిన్నతనం నుంచే తల్లిదండ్రులు పి ల్లలకు చక్కని జీవన శైలిని అలవాటు చేయాలని, రోజుకు ఒక గంట నడక, వ్యాయామం, యోగా, ధ్యానం వలన పీచు పదార్థాలున్న ఆహారం పౌష్టికా హారం తీసుకోవడం వలన కేన్సర్‌ వ్యాధుల నుంచి కాపాడుకోవచ్చునని అన్నారు. చాలా మంది కేన్సర్‌ బాధిత మహిళలు మనోధైర్యంతో చికిత్స పొంది కేన్సర్‌ని జయించడమే మరింత మందికి అవగాహన కల్పిస్తున్నారని అన్నారు. 3కె రన్‌ కార్యక్రమంలో ఎస్‌ఐ ఆర్‌ శ్రీను, ఎస్‌పీఎఫ్‌ సీఐ ఎం.వెంక టేశ్వరరావు, ఎస్‌ఐ కేఎన్‌.రావు, ఏఎస్‌ఐ సత్యనారాయణ, మహిళా పోలీసులు, పోలీసులు, ఎస్‌పీఎఫ్‌ సిబ్బంది, ఉప సర్పంచ్‌ కోరశిక శ్రీనివాస్‌, బుగ్గా మురళీకృష్ణ, సుమారు 200 మంది యువతీ యువకులు పాల్గొన్నారు.


వ్యాయామంతో ఆరోగ్యం


జీలుగుమిల్లి: నిత్య వ్యాయామంతో కేన్సర్‌తోపాటు పలు వ్యాధులకు దూరంగా, ఆరోగ్యంగా ఉండవచ్చని ఎస్‌ఐ వి.చంద్రశేఖర్‌ అన్నారు. జీలుగుమిల్లి సచివాలయం వద్ద ఆదివారం ఉదయం పోలీసు సిబ్బంది 5కె రన్‌ ప్రారంభించారు. ఆరోగ్య పరిరక్షణపై అవగాహన కల్పించారు. గిరిజన బాలికల వసతి గృహ విద్యార్ధులు సచివాలయ సిబ్బంది కలసి రామాలయం నుంచి పి.రాజవరం రోడ్డు వరకు 5కె.రన్‌ నిర్వహిం చారు. ఉపసర్పంచ్‌ బొంతు రవితేజ, గ్రామ, వార్డు వాలంటీర్లు హెడ్‌ కానిస్టేబుల్‌ సత్యానందం, ఉదయ్‌, పీసీ మంగరాజు ఉన్నారు.

Updated Date - 2021-10-25T04:52:42+05:30 IST