సెల్‌ఫోన్ డేటాతో ట్రేస్ చేసే పనిలో తలమునకలైన పోలీసులు

ABN , First Publish Date - 2020-04-05T20:08:10+05:30 IST

నిజాముద్దీన్ తబ్లిఘీ జమాత్ సదస్సులో పాల్గొన్న వారిని గుర్తించే పనిలో ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు నిమగ్నమయ్యారు. ఆ సదస్సులో పాల్గొన్నవారు

సెల్‌ఫోన్ డేటాతో ట్రేస్ చేసే పనిలో తలమునకలైన పోలీసులు

న్యూఢిల్లీ : నిజాముద్దీన్ తబ్లిఘీ జమాత్ సదస్సులో పాల్గొన్న వారిని గుర్తించే పనిలో ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు నిమగ్నమయ్యారు. ఆ సదస్సులో పాల్గొన్నవారు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి కరోనా పరీక్షలు చేయించుకోవాలని ప్రభుత్వము, అటు పోలీసు శాఖ విజ్ఞప్తి చేస్తున్నా, కొందరు ఏమాత్రం స్పందించక పోవడంతో ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ రంగంలోకి దిగింది. సెల్ ఫోన్ డేటా ఆధారంగా ఆ సదస్సులో ఎవరెవరు, ఎంత మంది పాల్గొన్నారన్న విషయాన్ని పోలీసులు గుర్తించనున్నారు.


నిజాముద్దీన్ ఘటన వెలుగులోకి వచ్చిన తర్వాతే దేశంలో కరోనా వైరస్ కేసులు పెరిగినట్లు ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది కూడా. ఇప్పటి వరకు తబ్లిఘీతో సంబంధమున్న దాదాపు వెయ్యి మందిని పోలీసులు గుర్తించినట్లు సమాచారం. అందులో విదేశీయులు కూడా ఉన్నారు. దాదాపు తొమ్మిది వేల మంది ఈ సదస్సులో పాల్గొని, దేశంలోని వివిధ ప్రాంతాలకు వెళ్లిపోయారు. వీరందర్ని కూడా పోలీసులు కాల్ డేటా ఆధారంగా గుర్తించే పనిలో తలమునకలై ఉన్నారు.


మార్చి నెలలో తబ్లిఘీలో ఎవరెవరున్నారన్న విషయాన్ని జీపీఎస్ లొకేషన్ ద్వారా ఢిల్లీ పోలీసులు గుర్తించనున్నారు. దీనికి ఇతర రాష్ట్రాల పోలీసులు కూడా వీరికి సహకరిస్తున్నారు. ఇప్పటికే దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఈ కార్యక్రమానికి హాజరైన వ్యక్తులను, వారు ఎవరెవర్ని కలుసుకున్నారన్న విషయాన్ని గుర్తించడానికి ట్రేసింగ్ జరుగుతూనే ఉంది. 

Updated Date - 2020-04-05T20:08:10+05:30 IST