పోలీసులకు కొవిడ్‌ వ్యాక్సిన్‌

ABN , First Publish Date - 2021-02-25T03:24:12+05:30 IST

కరోనా సమయంలో ఫ్రంట్‌ లైన్‌ వారియర్స్‌లో భాగమైన పోలీసులకు మొదటి విడత కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ ప్రారంభించారు.

పోలీసులకు కొవిడ్‌ వ్యాక్సిన్‌
కొవిడ్‌ వ్యాక్సిన్‌ వేయించుకుంటున్న మనుబోలు ఎస్‌ఐ ముత్యాలరావు

 మనుబోలు, ఫిబ్రవరి 24: కరోనా సమయంలో ఫ్రంట్‌ లైన్‌ వారియర్స్‌లో భాగమైన పోలీసులకు మొదటి విడత కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ ప్రారంభించారు. గూడూరు 1వ పట్టణ పోలీస్‌స్టేషన్‌ ఆవరణలో బుధవారం వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ప్రారంభించగా.. మనుబోలు పోలీసులకు వ్యాక్సిన్‌ వేశారు. పంచాయతీ ఎన్నికల విధుల్లో ఉండడంతో ఇతర ఉద్యోగులతో పాటు పోలీసులకు కొవిడ్‌ వ్యాక్సిన్‌ వేయలేదు. ఎస్‌ఐ. ముత్యాలరావుతో పాటు పదిమంది పోలీసులు కొవిడ్‌ వ్యాక్సిన్‌ వేయించుకున్నారు.

Updated Date - 2021-02-25T03:24:12+05:30 IST