Abn logo
Jun 14 2021 @ 23:34PM

గ్రావెల్‌ అక్రమ తరలింపుపై పోలీసుల కొరడా

వెంకటాచలం, జూన్‌ 14 : మండలంలోని చవటపాళెం పంచాయతీ సరస్వతి నగర్‌ వద్ద ఉన్న రవీంద్రభారతి స్కూల్‌కు ఎలాంటి అనుమతులు లేకుండా భూముల నుంచి  భారీగా  గ్రావెల్‌ తరలిస్తుండగా  పోలీసులు సోమవారం కొరడా ఝళిపించారు. స్థానికుల ఫిర్యాదుతో  తహసీల్దారు ఐఎస్‌ ప్రసాద్‌ ఆదేశాల మేరకు ఎస్‌ఐ షేక్‌ కరీముల్లా తన సిబ్బందితో కలిసి గ్రావెల్‌ తవ్వకాలు జరుపుతున్న ప్రాంతానికి చేరుకున్నారు. అక్కడ ఉన్న 6 ట్రాక్టర్లు, జేసీబీ, హిటాచీలను సీజ్‌ చేసి పోలీసు స్టేషన్‌కు తరలించారు. తహసీల్దారు ఇచ్చిన ఫిర్యాదు మేరకు రవీంద్రభారతి స్కూల్‌ యాజమాన్యంతోపాటు వాహనాల ఓనర్లు, డ్రైవర్లపై పోలీసులు కేసు నమోదు చేశారు.