30మంది పోలీసులకు అనారోగ్యం

ABN , First Publish Date - 2021-10-17T05:23:47+05:30 IST

30మంది పోలీసులకు అనారోగ్యం

30మంది పోలీసులకు అనారోగ్యం

ఎక్కువమంది కొవిడ్‌ బాధితులే..

దసరా ఉత్సవాల్లో విధులు నిర్వర్తించినవారే..

(ఆంధ్రజ్యోతి - విజయవాడ) : దసరా ఉత్సవాల బందోబస్తుకు వచ్చిన వారిలో మొత్తం 30 మంది వివిధ అనారోగ్య కారణాలతో ఆస్పత్రుల్లో చేరారు. వీరిలో చాలామందికి కొవిడ్‌ లక్షణాలు బయటపడినట్టు సమాచారం. వీరంతా భక్తుల క్యూ పక్కన నిలబడి విధులు నిర్వర్తించినవారే. దసరా ఉత్సవాల్లో ఎక్కడా కొవిడ్‌ నిబంధనలు పాటించలేదు. ఉత్సవాలకు లెక్కకుమించి భక్తులు రావడం, ముఖ్యంగా మూలానక్షత్రం, విజయదశమి రోజున మరీ ఎక్కువ రద్దీ ఉండటంతో అధికారులు ఆందోళన చెందుతున్నారు. పోలీసు శాఖలోనే 30 మంది వరకు లెక్క తేలితే, మిగిలిన శాఖల వారిలో ఎంతమందికి లక్షణాలు ఉన్నాయన్న దానిపై చర్చలు నడుస్తున్నాయి. కొంతమంది భక్తులు, విధులు నిర్వర్తించిన సిబ్బంది పరీక్షలు చేయించుకుంటున్నారు. 

Updated Date - 2021-10-17T05:23:47+05:30 IST