Abn logo
Sep 6 2021 @ 07:29AM

Pakistan: మహిళా ఎస్ఐపై లైంగిక వేధింపులు

ఇస్లామాబాద్ (పాకిస్తాన్): పాకిస్థాన్ పోలీసు దళానికి చెందిన ఒక మహిళా సబ్ ఇన్స్‌పెక్టర్‌ను ఒక వ్యక్తి కిడ్నాప్ చేసి ఆమెపై లైంగికదాడికి యత్నించాడు. పాకిస్థాన్ దేశంలోని పంజాబ్‌ రాష్ట్రం పరిధిలోని ముజఫర్‌గఢ్ జిల్లాలో క్రైమ్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న మహిళా సబ్ ఇన్స్‌పెక్టరును ఓ వ్యక్తి కిడ్నాప్ చేసి నిర్జన ప్రదేశానికి తీసుకువెళ్లి ఆమెను లైంగికంగా వేధించినట్లు తేలింది.ఓ వ్యక్తి మహిళా ఎస్‌ఐను తన కారులో కూర్చోబెట్టుకొని చమన్ బైపాస్ సమీపంలోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లాడు. అతను తన పిస్టల్‌తో బెదిరించి మహిళా సబ్ ఇన్‌స్పెక్టర్‌పై పలుమార్లు అత్యాచారానికి ప్రయత్నించాడు. 

తీవ్రంగా గాయపడిన మహిళా సబ్ ఇన్‌స్పెక్టర్‌ను ముజఫర్‌గఢ్ జిల్లా ప్రధాన కార్యాలయం ఆసుపత్రికి తరలించినట్లు పోలీసు అధికార ప్రతినిధి వసీం ఖాన్ గోపాంగ్ తెలిపారు.ఈ కేసులో నిందితుడిని అరెస్టు చేశామని, అతని వద్ద నుంచి కారును స్వాధీనం చేసుకున్నామని పాక్ పోలీసులు చెప్పారు. పాకిస్థాన్ దేశంలో రోజురోజుకు మహిళలపై అత్యాచారాలు, లైంగికవేధింపులు ఎక్కువగా జరుగుతున్నాయి. దీంతో పాక్ లో మహిళ భద్రత ప్రశ్నార్థకంగా మారింది.ఇటీవల ఓ ప్రిన్సిపాల్ ఓ మహిళా టీచరును లైంగికంగా వేధించాడు.

క్రైమ్ మరిన్ని...