ప్రైవేట్‌ డెయిరీలను ప్రోత్సహించేలా విధానాలు

ABN , First Publish Date - 2022-01-23T05:20:44+05:30 IST

ప్రైవేట్‌ డెయిరీలను ప్రోత్సహించేలా విధానాలు

ప్రైవేట్‌ డెయిరీలను ప్రోత్సహించేలా విధానాలు
విలేకరులతో మాట్లాడుతున్న గూడూరు శ్రీనివాస్‌రెడ్డి

  • డీసీసీ అధికార ప్రతినిధి శ్రీనివా్‌సరెడ్డి 


కడ్తాల్‌, జనవరి 22: ప్రైవేట్‌ డెయిరీలు, దళారులను ప్రోత్సహించేలా రాష్ట్ర ప్రభుత్వ, టీఎ్‌సడీడీసీఎఫ్‌ విధానాలు ఉన్నాయని డీసీసీ అధికార ప్రతినిధి గూడూరు శ్రీనివా్‌సరెడ్డి అన్నారు. మండల కేంద్రంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు.మండల కేంద్రంలో విజయ పాల ఉత్పత్తుల పెంపునకు రాష్ట్ర ప్రభుత్వం పాడి రైతులకు లీటర్‌కు రూ.4 ప్రోత్సాహకం ప్రకటించినా ఏనాడూ సక్రమంగా అందించలేన్నారు. 2020 ఏప్రిల్‌ నుంచి జిల్లాలో పాడిరైతులకు ప్రోత్సాహక డబ్బు అందడం లేదన్నారు. జిల్లా వ్యాప్తంగా విజయ పాడిరైతులకు రూ.13.86 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉందని తెలిపారు. ప్రోత్సాహక బకాయిని విడుదల చేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ప్రభుత్వం బకాయిలను విడుదల చేసినా రైతులకు చెల్లించడంలో టీఎ్‌సడీడీసీఎఫ్‌ చొరవ చూపకపోవడంతో పాడిరైతులు ప్రైవేట్‌ డెయిరీలవైపు మొగ్గు చూపుతున్నారని అన్నారు. 21నెలలుగా ప్రోత్సాహక నగదు అందక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. కడ్తాలలోని పాలశీతలీకరణ కేంద్రం పరిధిలోనే రూ.5.43కోట్ల బకాయిలు ఉన్నాయని చెప్పారు. బకాయిలను వెంటనే విడుదలచేసి పాడి రైతులకు చెల్లించాలని లేదంటే జిల్లా వ్యాప్తంగా కాంగ్రె్‌సపార్టీ ఆధ్వర్యంలో ఉద్యమిస్తామని హెచ్చరించారు. అదేవిధంగా సబ్సిడీ పాడి ఆవుల కోసం కడ్తాల మండల కేంద్రానికి చెందిన 115మంది రైతులు, తలకొండపల్లి మండలానికి చెందిన 24మంది రైతులు 2018లో డీడీలు అందజేసినా నేటికీ ప్రభుత్వం వారికి పాడిఆవులను అందించలేదన్నారు. ఒక్కో ఆవుకు రూ.40వేల చొప్పున బీసీ రైతులు, రూ.20వేల చొప్పున ఎస్సీ, ఎస్టీ పాడి రైతులు డీడీలు చెల్లించి ఏళ్లుగా అధికారుల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నా స్పందన లేదన్నారు. శిథిలావస్థకు చేరిన కడ్తాల పాలశీతలీకరణ కేంద్రాన్ని ఆధునీకరించి నూతన భవనాలు నిర్మించి ఆధునిక యంత్రాలను ఏర్పాటు చేయాలని శ్రీనివా్‌సరెడ్డి డిమాండ్‌ చేశారు. సమావేశంలో  పీఏసీఎస్‌ డైరెక్టర్‌ చేగూరి వెంకటేశ్‌, మండల కో-ఆప్షన్‌ సభ్యుడు జహంగీర్‌బాబా, మాజీ ఎంపీటీసీ గురిగళ్ల లక్ష్మయ్య, మల్లేశ్‌గౌడ్‌, యాదయ్యగౌడ్‌, మల్లయ్య, రామచందర్‌ నాయక్‌, కాలే వెంకటేశ్‌, పాండు, కృష్ణయ్య, శ్రీరాములు, మల్లేశ్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2022-01-23T05:20:44+05:30 IST