పుంజుకోని పాలసీబజార్...

ABN , First Publish Date - 2022-01-26T00:55:45+05:30 IST

పాలసీబజార్ మాతృ సంస్థ పీబీ ఫిన్‌టెక్ షేర్లు ఒత్తిడినెదుర్కొంటున్నాయి.

పుంజుకోని పాలసీబజార్...

హైదరాబాద్ : పాలసీబజార్ మాతృ సంస్థ పీబీ ఫిన్‌టెక్ షేర్లు ఒత్తిడినెదుర్కొంటున్నాయి. ఆరవ వరుస ట్రేడింగ్ రోజున రూ. 726 వద్ద ట్రేడింగ్ అవుతున్నాయి. ఇది మంగళవారం నాటి ఇంట్రా-డేలో శ్రేణి బౌండ్ మార్కెట్‌లో 6.5 శాతం తగ్గింది. గత ఆరు రోజుల్లో కంపెనీ షేర్లు 29 శాతం పతనమయ్యాయి. ఈ రోజు... కొత్త కనిష్ట స్థాయి వద్ద ట్రేడవుతున్నాయి. మార్కెట్ ధరలో భారీ క్షీణతతో షేరు ఇష్యూ ధర రూ. 980 నుంచి 26 శాతం తగ్గింది. ఈ రోజు పతనం తర్వాత ఇది... నిరుడు నవంబరు 17 న తన ఆల్-టైమ్ గరిష్టం  రూ. 1,470 నుంచి 51 శాతం పడిపోయింది. ఈరోజు ఒక్కో షేరు ఇష్యూ ధర రూ. 980 నుంచి 12 శాతం తగ్గింది. పీబీ ఫిన్‌టెక్ నిరుడు నవంబరు 15 న స్టాక్ మార్కెట్‌లోకి ప్రవేశించింది. స్టాక్ ధరలో నిరంతర క్షీణతతో పీబీ ఫిన్‌టెక్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 40 వేల కోట్ల మార్క్ దిగువకు పడిపోయింది. ప్రస్తుతం రూ. 33,561 కోట్లకు చేరుకుంది. దీంతో, మార్కెట్ క్యాప్‌పరంగా టాప్-100 అత్యంత విలువైన లిస్టెడ్ కంపెనీల నుంచి కూడా పీబీ ఫిన్‌టెక్ తప్పుకుంది.

Updated Date - 2022-01-26T00:55:45+05:30 IST