తీవ్రవాద ప్రభావ మండలాల్లో ఎమ్మెల్సీ పోలింగ్‌ సమయం కుదింపు

ABN , First Publish Date - 2021-03-06T05:56:47+05:30 IST

ఎన్నికల సంఘం ఆమోదం మేరకు రంపచోడవరం, ఎటపాక రెవెన్యూ డివిజన్ల పరిధిలో తీవ్రవాద ప్రభావం ఉన్న 11 మండలాల్లోని 12 పోలింగ్‌ కేంద్రాల్లో ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌ సమయాన్ని కుదించారు.

తీవ్రవాద ప్రభావ మండలాల్లో ఎమ్మెల్సీ పోలింగ్‌ సమయం కుదింపు

డెయిరీఫారమ్‌ సెంటర్‌ (కాకినాడ), మార్చి 5: ఎన్నికల సంఘం ఆమోదం మేరకు రంపచోడవరం, ఎటపాక రెవెన్యూ డివిజన్ల పరిధిలో తీవ్రవాద ప్రభావం ఉన్న 11 మండలాల్లోని 12 పోలింగ్‌ కేంద్రాల్లో ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌ సమయాన్ని కుదించారు. ఈ నెల 14వ తేదీ ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే పోలింగ్‌ జరుగుతుందని కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి డి.మురళీధర్‌రెడ్డి తెలిపారు. జిల్లాలోని మిగిలిన అన్ని పోలింగ్‌ కేంద్రాల్లో ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్‌ జరుగుతుందని కలెక్టర్‌ శుక్రవారం ఒక ప్రకటనలో చెప్పారు.

Updated Date - 2021-03-06T05:56:47+05:30 IST