Abn logo
Jun 16 2021 @ 03:42AM

రానున్న రోజుల్లో మారనున్న రాజకీయ సమీకరణాలు

  • అందుకనుగుణంగానే రాజకీయ మార్పులు
  • ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్సీ కవిత

జగిత్యాల, జూన్‌ 15 (ఆంధ్రజ్యోతి): రానున్న రోజుల్లో రాష్ట్ర రాజకీయ సమీకరణాలు మారబోతున్నాయని ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యానించారు. అందుకు అనుగుణంగానే రాజకీయంగా మార్పులు జరుగుతాయన్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో మంగళవారం జిల్లా గ్రంథాలయ అభివృద్ధి కమిటీ నూతన పాలకవర్గ అభినందన సభలో మంత్రి కొప్పుల ఈశ్వర్‌తో కలిసి ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా కవిత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో యువతకు, విద్యార్థులకు ఉపయోగపడే విధంగా పటిష్ఠమైన గ్రంథాలయ వ్యవస్థను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి కొప్పుల ఈశ్వర్‌ అన్నారు. ప్రతీ జిల్లాలో బీసీ, ఎస్సీ స్టడీ సర్కిల్‌ ఏర్పాటు చేస్తామని ఆయన పేర్కొన్నారు.