Abn logo
Sep 20 2021 @ 19:45PM

హేమంత్ సోరెన్‌కు నితీష్ చురకలు

పాట్నా: బీహార్, జార్ఖాండ్‌లు సోదరులని, వారి మధ్య భాషాపరమైన అడ్డుగోడలు సృష్టించవద్దని బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ అన్నారు. జార్ఖాండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌ను పరోక్షంగా ఉద్దేశించి నితీష్ ఈ వ్యాఖ్యలు చేశారు. హేమంత్ సోరెన్ ఒక ఇంటర్వ్యూలో బీహార్ భాషలైన భోజ్‌పురి, మాగవిలను అక్కడ్నించే తెచ్చుకున్నామంటూ చెప్పడంపై నితీష్ స్పందిస్తూ, 2000లో బీహార్, జార్ఖాండ్‌ల మధ్య విభజన జరిగిందని అన్నారు. ఇరు రాష్ట్రాల ప్రజలు ఒకరి పట్ల మరొకరు ప్రేమ, ఆప్యాయతాలు కలిగి ఉండాలని అన్నారు. కొందరు ఎందుకు రాజకీయపరమైన వ్యాఖ్యలు చేస్తారో తనకు తెలియదని, జార్ఖాండ్ విడిపోయినప్పటికీ అక్కడి ప్రజలపై తమకెంతో ప్రేమ ఉందని చెప్పారు. తాము వేర్వేరనే భావన మనసులో రానీయరాదని, అంతా ఒకే కుటుంబానికి చెందిన వాళ్లమని, అందరూ సామరస్యపూర్వక జీవనం సాగించాలని ఆకాంక్షించారు.

ఇవి కూడా చదవండిImage Caption