నాయకులారా.. ఏదీ భరోసా..?

ABN , First Publish Date - 2021-05-11T06:30:14+05:30 IST

అప్పుడేమో ఇళ్లవద్దకొచ్చారు... జాగ్రత్తగా ఉండాలంటూ చెప్పారు. లాక్‌డౌనతో ఉపాధి కోల్పోవడంతో నిత్యావసర సరుకులు పంచారు. మరి ఇప్పుడేమైందో ఏమోగానీ.. ఏ రాజకీయ నాయకుడు అగుపించడం లేదు. అప్పుడు ఎన్నికలున్నాయని వచ్చినట్లున్నారు.

నాయకులారా.. ఏదీ భరోసా..?

ప్రాణాలు పోతున్నా... చలించరేమి..?

దోపిడీకి గురవుతున్నా మిన్నకుండిపోతే ఎలా..?

ఒకరిపై ఒకరు ఆరోపణలతోనే సరిపెడతారా..?

మా ప్రాణాలు పట్టవా..?

అనంత జనం ఆక్రందనిదీ..

అనంతపురం, మే10(ఆంధ్రజ్యోతి): అప్పుడేమో ఇళ్లవద్దకొచ్చారు... జాగ్రత్తగా ఉండాలంటూ చెప్పారు. లాక్‌డౌనతో ఉపాధి కోల్పోవడంతో నిత్యావసర సరుకులు పంచారు. మరి ఇప్పుడేమైందో ఏమోగానీ.. ఏ రాజకీయ నాయకుడు అగుపించడం లేదు. అప్పుడు ఎన్నికలున్నాయని వచ్చినట్లున్నారు. ఇప్పుడు ఎన్నికలు లేవని మొహం చాటేసినట్లున్నారు. కరోనా మహమ్మారి బారిన పడి ఎందరో చనిపోతున్నారు. అనాథ శవాలుగా శ్మశాన వాటికలకు తరలిపోతు న్నా... కనికరం చూపడం లేదాయె. మరెందరో అ భాగ్యులుగా మిగిలిపోతున్నా... పట్టించుకోవడం లే దు. మా ప్రాణాలు పట్టవా...? ఇదేనా... రాజకీయ నాయకులిచ్చే భరోసా..? అంటూ జిల్లా ప్రజానీకం ఆక్రోశిస్తోంది. ప్రజాప్రతినిధులుగా ఎన్నుకోవడానికేనా..? రాజకీయ నా యకులుగా సంఘంలో గుర్తింపునిచ్చేందుకేనా... ఓట్లు వేసే యంత్రాలుగా మమ్మల్ని చూస్తున్నారంటూ ప్రజల నుంచి ఆవేదన వెల్లువెత్తుతోంది. ఎంతసేపూ రాజకీయాలేనా...? మమ్మల్ని ఆదుకోవాలన్న ఆలోచన చేయరెందుకని ప్రశ్నిస్తున్నా రు. మా ప్రాణాలు అనంత వాయువుల్లో కలిసిపోవాల్సిందేనా అంటూ ని ట్టూరుస్తున్నారు. ప్రజల నుంచి ఈ స్థాయి లో ఆక్రందన వినిపిస్తున్నాయి. ప్రాణవాయువు అందక పదుల సంఖ్యలో మృత్యువాత పడ్డారు. కరోనా సెకెండ్‌వేవ్‌లో ఇప్పటికే అంటే... 40 రోజుల్లో ఏకంగా 130 మంది చనిపోయారంటే... పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయో అర్థమవుతోంది. ఇలాంటి విపత్కర పరిస్థితుల నేపథ్యంలో.. సంఘటితంగా, సమన్వయంగా పనిచేసి ప్రజల ప్రాణాలను కాపాడాల్సిన బాద్యత అటు జిల్లా యంత్రాంగం, ఇటు రాజకీయ నాయకులపై ఉందనడంలో అతిశయోక్తి లేదు. పాలక పార్టీ నాయకుల భాగస్వామ్యం ఎక్కువగా ఉండాలి. క్షేత్రస్థాయిలో పరిస్థితులు ఆ స్థాయిలో కనిపించడం లేదన్నదే ప్రజల ఆవేదన. జిల్లాలో అధికార పార్టీ ప్రజాప్రతినిఽధుల్లో వేళ్లమీద లెక్కబెట్టేలా ఒకరిద్దరు మినహా... మిగిలిన వారెవరూ పెద్దగా చొరవ చూపడంలేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మీడియా సమావేశాలతోనే సరిపెట్టుకుంటున్నారన్న ఆరోపణలు లేకపోలేదు. అలా అని మిగిలిన రాజకీయ పక్షాలు.. ప్ర జలకు బాసటగా నిలుస్తున్నా యా... అంటే అదీ లేదా యే. విమర్శలు, ఆరోపణ లు, నిరసనలతోనే కా లం వెల్లబుచ్చుతున్నారన్న అ భిప్రాయమూ సామాన్య జ నం నుంచి వ్య క్తమవుతోంది. ప్రత్యేకంగా ఇక్కడ ఒక విషయాన్ని ప్రస్తావించుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ప్రజాసమస్యలపై పోరా టం చేయడమే వా మపక్ష పా ర్టీల క ర్తవ్యం. క రోనా మహమ్మారి వి స్ఫోటంలా వ్యాప్తి చెందుతు న్న నేపథ్యంలో.. వేలా ది మంది దాని కోరల్లో చి క్కుకొని విలవిల్లాడుతున్నా రు. అలాంటి వారికి మే మున్నామంటూ... సీపీఎం ముందుకు రా వడం హర్షించదగ్గ పరిణామంగా చె ప్పుకోవచ్చు. కరోనా బాధితులను అక్కున చేర్చుకుని, వైద్యంతోపాటు భోజన సౌకర్యాలు ఏర్పాటు చేసి, వారు కోలుకునే విధంగా నాయకులు మనోధైర్యం నింపే ప్రయత్నం చేస్తున్నారు. ప్రముఖ రచయిత, కవి సింగమనేని నారాయణ పేరుతో క్వారంటైన కేంద్రాన్ని నెలకొల్పారు. కరో నా బాధితులకు అన్నీ తామై ఆ పార్టీ నాయకులు సేవలందిస్తున్నారు. సీపీఎం సేవలకు సలామ్‌.. అంటూ వివిధ వర్గాల ప్రజల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం ఈ సెంటర్‌లో 50 మంది బా ధితులకు సేవలందుతున్నాయి. మరెందుకు ఇతర రాజకీయ పార్టీలు.. బాధితులను ఆదుకునేందుకు ముందుకు రావడం లేదన్న ప్రశ్న అన్ని వ ర్గాల ప్రజల నుంచి ఉత్పన్నమవుతోంది. మానవతావాదులు ఎవరికి తో చినంత వారు సాయమందిస్తున్నారు. ఆ స్ఫూర్తి మిగతా రాజకీయ పార్టీల నాయకులకు ఎందుకు వంటపట్టడం లేదనే ఆవేదన బాధిత వర్గాల నుంచి వ్యక్తమవుతుండటం గమనార్హం.


మండలానికో క్వారంటైన నిర్వహించలేరా..?

జిల్లాలో కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో రోజురోజుకీ బాధితుల సంఖ్య పెరిగిపోతోంది. వందలాది మంది కరోనా బారిన పడుతున్నారు. జిల్లాలోని అన్ని ప్రాంతాలను కరోనా కమ్మేసింది. ఇలాంటి పరిస్థితుల్లో కరోనా స్వల్ప లక్షణాలున్న బాధితుల్లో ఆత్మస్థైర్యం నింపేలా మండలానికో క్వారంటైన నిర్వహించలేని పరిస్థితుల్లో రాజకీయ పార్టీల నాయకులున్నారా..? అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. క్వారంటైన కేంద్రాన్ని ఏర్పాటు చేసి, బాధితులకు భరోసా కల్పించాల్సిన బాధ్య త లేదా అని నిలదీస్తున్నారు. సరైన పౌష్టికాహారమందించడంతోపాటు సరైన సమయానికి మందులు ఇస్తే బాధితులు కరోనా నుంచి కోలుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయని తెలిసినా... రాజకీయ నాయకులు తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలను ప్రజల నుంచి ఎదుర్కొంటున్నారు. ఎక్కడికక్కడ మండల కేంద్రంలో క్వారంటైన కేంద్రాలను నిర్వహించడం ద్వారా రాజకీయ నాయకులు ప్రజల్లో భరోసా నింపిన వారవుతారనడంలో సందేహం లేదు. ఆ దిశగా వారు ఆలోచించాలని ప్రజలు కోరుకుంటున్నారు.


దోపిడీకి గురవుతున్నా మిన్నకుండిపోతే ఎలా..?

కరోనా బాధితుల జీవితాలతో ప్రైవేట్‌ ఆస్పత్రుల యాజమాన్యాలు చెలగాటమాడుతున్నాయి. లక్షలాది రూపాయల ఫీజులు వసూలు చేస్తున్నాయి. దురదృష్టవశాత్తు చనిపోతే మృతదేహాన్ని శ్మశాన వాటికకు తరలించాలంటే రూ.25 వేల నుంచి రూ.35 వేలు అంబులెన్సు నిర్వాహకులు దండుకుంటున్నారు. ఇలా ఓవైపు ఆస్పత్రుల యాజమాన్యాలు, మరోవైపు అంబులెన్సు నిర్వాహకులు ఇష్టారాజ్యంగా దండుకుంటున్నా... అడ్డుకునే నాథుడే కరువయ్యారు. బాధితులు, బాధిత కుటుంబాలు దోపిడీకి గురవుతున్నా.. రాజకీయ నాయకులు మిన్నకుండిపోతే ఎలా అని ప్రజలు నిలదీస్తున్నారు. ఇప్పటికైనా రాజకీయ నాయకుల్లో మార్పు రావాలని జిల్లాప్రజానీకం కోరుకుంటోంది. కరోనా విపత్కర పరిస్థితుల్లో ప్రజలకు బాసటగా నిలవాలని రాజకీయ నాయకులను కోరుకుంటున్నారు. మరి రాజకీయ నాయకుల ఆలోచనలు ఆ దిశగా సాగాలని ఆశిద్దాం. 

Updated Date - 2021-05-11T06:30:14+05:30 IST