రైతు ముసుగులో రాజకీయం

ABN , First Publish Date - 2020-10-19T10:23:00+05:30 IST

రైతు ముసుగులో రాజకీయం చేస్తే టీఆర్‌ఎస్‌ పార్టీ సహించదని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ అన్నారు. జగిత్యాలలో ఆదివారం ఏ ర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్‌, బీజేపీ

రైతు ముసుగులో రాజకీయం

దాడులు చేస్తే చూస్తూ ఊరుకోం..

మొక్కజొన్న పంట వద్దని ముందే చెప్పాం

రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌


జగిత్యాల, అక్టోబరు 18 (ఆంధ్రజ్యోతి): రైతు ముసుగులో రాజకీయం చేస్తే టీఆర్‌ఎస్‌ పార్టీ సహించదని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ అన్నారు. జగిత్యాలలో ఆదివారం ఏ ర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్‌, బీజేపీ నాయకులు రైతు పేరిట ధర్నాలు చేసి దాడులకు దిగడాన్ని ఖండిస్తున్నామన్నారు. దౌర్జన్యానికి దిగితే చూస్తూ ఊ రుకోమని, బుద్ధి చెబుతామన్నారు. మొక్కజొన్న పంట నిల్వలు ఇప్పటికే ఎక్కువగా ఉన్నాయని, నియంత్రిక సాగుతో మొక్కజొన్న సాగు చేయవద్దని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ముందే చెప్పారని అన్నారు. కేవలం ఇంటి అవసరాలకు ఉపయోగపడే విధంగానే సాగు చేసుకోవాలని పేర్కొన్నా సాగు విస్తీర్ణం పెరిగిందన్నారు. అవసరం లేకున్నా కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఇతర దేశా ల నుంచి మొక్కజొన్న పంటను దిగుమతి చేసుకుందని, దిగుమతి సుంకాన్ని కూడా 35 శాతం నుంచి 15 శాతానికి ఎవరి కోసం తగ్గించిందో చెప్పాలన్నారు. కేంద్ర ప్రభుత్వమే రైతులకు నష్టం చేస్తూ టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం చేస్తే సహించేది లేదన్నారు. పంటలకు మ ద్దతు ధర కల్పించాలంటూ రైతు సంఘం పేరిట చేసిన ధర్నాలో ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి అనుచ రులైన లక్ష్మీపూర్‌కు చెందినవారే ఉన్నారని, అలాగే బీజేపీ వారు కూడా ఉన్నారన్నారు.


నిజంగా నిజాయితీ ఉంటే పార్టీ పేరు చెప్పి వస్తే తాము సమాధానం చెబుతామన్నారు. రైతులు అడగక ముందే ముఖ్యమంత్రి కేసీఆర్‌ ముందుకు వచ్చి రైతులకు లబ్ధి చేకూరే విధంగా ఉచిత కరెంట్‌ ఇవ్వడంతో పాటు రుణమాఫీ చేశారని, రైతుబంధు, రైతు బీమా ఇస్తున్నారని, ప్రాజెక్ట్‌ల నిర్మాణం చేపట్టి పూర్తి స్థాయిలో ఆయకట్టుకు నీరందించేలా చర్యలు చేపట్టారని అన్నారు. ఈ సమావేశం లో జిల్లా పరిషత్‌ చైర్‌ పర్సన్‌ దావ వసంత, కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్‌ రావు, చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌, డీసీఎంఎస్‌ చైర్మన్‌ శ్రీకాంత్‌ రెడ్డి, జడ్పీ వైస్‌ చైర్మన్‌ హరిచరణ్‌ రావు, రైతు సమన్వయ సమితి చైర్మన్‌ చీటి వెంకట్‌ రావు, జడ్పీటీసీలు, ఎంపీపీలు పాల్గొన్నారు.

Updated Date - 2020-10-19T10:23:00+05:30 IST