నాటి స్వాతంత్ర్య యోధులపై నేడు రాజకీయాలు!

ABN , First Publish Date - 2021-09-07T06:01:13+05:30 IST

డెబ్బై అయిదేళ్ల స్వాతంత్ర్యం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం దేశ మంతటా అమృతోత్సవాలు ప్రారంభించడం అభినందనీయం. ఈ సందర్భంగా స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్న అమరజీవుల్ని...

నాటి స్వాతంత్ర్య యోధులపై నేడు రాజకీయాలు!

డెబ్బై అయిదేళ్ల స్వాతంత్ర్యం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం దేశ మంతటా అమృతోత్సవాలు ప్రారంభించడం అభినందనీయం. ఈ సందర్భంగా స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్న అమరజీవుల్ని, వారి త్యాగాల్ని స్మరించుకోవాలి. ఒకరిని స్మరించి, వేరొకరిని విస్మరించే ధోరణి ఆరోగ్యకరం కాదు. ఇటీవల కేంద్ర విద్యాశాఖ ఆధ్వర్యం లోని భారత చరిత్ర పరిశోధన సంస్థ (ఐసీ‍హెచ్‍ఆర్) విడుదల చేసిన స్వాతంత్ర్య యోధుల బ్రోచరులో నెహ్రూ ఫోటో లేదు. పోరాటంలో తొమ్మిదేళ్లు కారాగారంలో గడిపిన చరిత్ర ఉన్న భారత మొదటి ప్రధాని ఫోటో తీసేయటమేగాక, ప్రతిపక్షాలు ప్రశ్నించటాన్ని అన వసర వివాదమని ఆ సంస్థ తేల్చింది. ఏమైనా అర్థముందా? సుభాష్ బోస్ నేతృత్వంలోని ఆజాద్ హింద్ ఫౌజులో పని చేసిన వీరుల్ని యోధులుగా గుర్తించడం లేదని తెలిసింది. అలాగే స్వాతంత్య్రం వచ్చిన పిమ్మట, 1947లో అల్లూరి సీతారామరాజు మాతృమూర్తి తమను రాజకీయ బాధితులుగా గుర్తిస్తూ ప్రభుత్వసాయంకోసం దరఖాస్తు చేస్తే అల్లూరి ఖైదు జీవితం గడపలేదన్న కారణంతో అప్పటి ప్రభుత్వం తిరస్కరించిందట. ఇలా ఎందరో సమరయోధుల పట్ల జరిగిన, జరుగుతున్న అన్యాయాల్ని సరిదిద్దాల్సిన తరుణమిదే. 

డి.వి.జి. శంకరరావు

Updated Date - 2021-09-07T06:01:13+05:30 IST