గ్రేటర్‌ వార్‌.. అంతా తయార్‌..!

ABN , First Publish Date - 2020-11-30T16:20:50+05:30 IST

గ్రేటర్‌ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. రేపు జరిగే పోలింగ్‌కు పూర్తిస్థాయి ఏర్పాట్లు చేసినట్టు జీహెచ్‌ఎంసీ ప్రకటించింది. 150 వార్డుల్లో 74.44 లక్షల ఓటర్లు ఉండగా......

గ్రేటర్‌ వార్‌.. అంతా తయార్‌..!

రేపు పోలింగ్‌.. ఏర్పాట్లు పూర్తి

నేడు డీఆర్‌సీ సెంటర్ల నుంచి ఎన్నికల సామాగ్రీ

రిజర్వ్‌తో కలిపి 48 వేలకుపైగా సిబ్బంది

52 వేలమందికిపైగా పోలీసులు

సమస్యాత్మక కేంద్రాలపై ప్రత్యేక దృష్టి

150 వార్డులు.. 1122 మంది అభ్యర్థులు


హైదరాబాద్‌ సిటీ (ఆంధ్రజ్యోతి): గ్రేటర్‌ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. రేపు జరిగే పోలింగ్‌కు పూర్తిస్థాయి ఏర్పాట్లు చేసినట్టు జీహెచ్‌ఎంసీ ప్రకటించింది. 150 వార్డుల్లో 74.44 లక్షల ఓటర్లు ఉండగా... 1122 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. పోస్టల్‌ బ్యాలెట్‌ కోసం 2600లకుపైగా దరఖాస్తులు వచ్చాయి. వార్డుకు ఒకరు చొప్పున 150 మంది రిటర్నింగ్‌ అధికారులు, 150 మంది సహాయ రిటర్నింగ్‌ అధికారులు ఉన్నారు. మొత్తం వార్డుల్లోని 2,937 ప్రాంతాల్లో 9101 పోలింగ్‌ కేంద్రాలున్నాయి. ఒక్కో పోలింగ్‌ కేంద్రానికి ప్రిసైడింగ్‌ అధికారి, అసిస్టెంట్‌ ప్రిసైడింగ్‌ అధికారి సహాయకులతో కలిపి నలుగురు చొప్పున 36,404 మంది సిబ్బందికి బాధ్యతలు అప్పగించారు. మరో 25 శాతం రిజర్వ్‌ ఉద్యోగులతో కలిపి 48వేల సిబ్బంది అందుబాటులో ఉన్నారని ఎన్నికల అధికారి డీఎస్‌ లోకే్‌షకు మార్‌ తెలిపారు. జంగమ్మెట్‌లో అత్యధికంగా 20 మంది అభ్యర్థులు బరిలో ఉండగా.. అత్యల్పంగా ఉప్పల్‌, బార్కస్‌, నవాబ్‌సాహెబ్‌ కుంట, టోలిచౌకి, జీడిమెట్లలో ముగ్గురు చొప్పున అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. మెజార్టీ డివిజన్లలో పది మందిలోపే అభ్యర్థులు ఉండడంతో జంబో బ్యాలెట్‌ అవసరం లేకుండా పోయింది. దీంతో ఒక్కో పోలింగ్‌ కేంద్రానికి రెండు బ్యాలెట్‌ బాక్సులు సరిపోతాయని అధికారులు చెబుతున్నారు. నేడు డీఆర్‌సీ సెంటర్ల నుంచి బ్యాలెట్‌ బాక్సులు, ఇతర ఎన్నికల సామగ్రిని పోలింగ్‌ సిబ్బంది తీసుకోవాలని చెప్పారు. 


సున్నిత, సమస్యాత్మక ప్రాంతాలపై...

గ్రేటర్‌లోని పలు ప్రాంతాల్లో స్థానిక పరిస్థితులు, గత ఘటనలను దృష్టిలో ఉంచుకొని సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలను గుర్తించారు. పాతబస్తీ పరిధిలోనే ఎక్కువగా సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలు ఉన్నాయి. ఎన్నికల్లో శాంతి భద్రతల నిర్వహణకు 52,500 మంది పోలీస్‌ సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నా రు. సున్నిత, సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాల్లో పరిస్థితులు అదుపులో ఉండేలా అదనపు బందోబస్తు ఉంటుందని అధికారులు చెబుతున్నారు. పారదర్శకంగా ఎన్నికల ప్రక్రియ జరిగేలా 60 ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ లు, 30 స్టాటిక్‌ సర్వైలెన్స్‌ బృందాలు ఏర్పాటు చేశామన్నారు. 12 మంది సాధారణ పరిశీలకులు, 30 మంది వ్యయ పరిశీలకులను నియమించారు. 


పోలింగ్‌ రోజు....

రేపు ఉదయం 5.30 గంటల వరకు సిబ్బంది సంబంధిత పోలింగ్‌ కేంద్రాల్లో అందుబాటులో ఉండాలి. ముందు రోజే డిస్ర్టిబ్యూషన్‌, రిసెప్షన్‌, కౌంటింగ్‌ కేంద్రాల వద్ద సామగ్రి తీసుకోవాలి. 

ఉదయం 6 గంటలకు పోలింగ్‌ ఏజెంట్లు హాజరు కావాలి. 

ఉదయం 6 నుంచి 6.15 గంటల మధ్య మాక్‌ పోలింగ్‌ జరుగుతుంది. 

ఉ.6.55 గంటలకు బ్యాలెట్‌ బాక్సుల సీల్‌ తెరుస్తారు. 

ఉ.7 గంటలకు పోలింగ్‌ ప్రారంభమవుతుంది. 

సాయంత్రం 6 గంటలకు పోలింగ్‌ ముగుస్తుంది. సాధారణంగా సా.5 గంటలు పోలింగ్‌ ముగింపు సమయం కాగా.. కొవిడ్‌ నేపథ్యంలో 6 గంటల వరకు పొడిగించారు. ఆ సమయంలోపు లైనులో ఉన్న వారికి ఓటు వేసే అవకాశం ఉంటుంది. 

ఓటర్‌ గుర్తింపు కార్డు లేకుంటే ఎన్నికల సంఘం ప్రకటించిన ఇతర కార్డుల్లో ఏదైనా ఒక గుర్తింపు కార్డు చూపి ఓటు వేయవచ్చు. 

ప్రతి పోలింగ్‌ స్టేషన్‌లో వృద్ధులు, వికలాంగులకు ప్రత్యేక క్యూలైన్ల ఏర్పాటు. 

తాగునీరు, మరుగుదొడ్లు, వీల్‌ చెయిర్లు, ర్యాంపులు వంటివి ఏర్పాటు. 


నో మాస్క్‌.. నో ఓట్‌...

కొవిడ్‌-19 నేపథ్యంలో ప్రత్యేక జాగ్రత్తలు

హైదరాబాద్‌ సిటీ, నవంబర్‌ 29 (ఆంధ్రజ్యోతి): మాస్క్‌ ధరించకుండా ఓటు వేసేందుకు వస్తే పోలింగ్‌ కేంద్రంలోకి అనుమతించ వద్దని ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఎలక్షన్‌ కమిషన్‌ ఆదేశాల మేరకు పోలింగ్‌ కేంద్రాల వద్ద మాస్క్‌లు, శానిటైజర్లు అందుబాటులో ఉంచుతున్నట్టు జీహెచ్‌ఎంసీ అధికారులు తెలిపారు. కొవిడ్‌-19 వ్యాప్తి నేపథ్యంలో పోలింగ్‌ రోజున వైరస్‌ వ్యాప్తి చెందకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని నిర్ణయించారు. రెండో దశ కరోనా సోకే ప్రమాదముందన్న హెచ్చరికల నేపథ్యంలో ఏర్పాట్లపై దృష్టి సారించా లని ఉన్నతాధికారులు సూచించారు. ఓటర్లు భౌతిక దూరం పాటించేలా మార్కింగ్‌ చేయాలన్నారు. ఓటు వేసే సమయంలో ఓటర్‌ మాస్క్‌ తొలగించి ముఖాన్ని ప్రిసైడింగ్‌ ఆఫీసర్‌కు చూపించాలి. పోలింగ్‌ అధికారుల వద్ద కూడా భౌతిక దూరం పాటించాలి. 


పీపీఈ కిట్‌లు.. 

పోలింగ్‌ సిబ్బందికి సంబంధించి మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మాస్క్‌లు, గ్లౌస్‌లు, ఫేస్‌ షీల్డులు, శానిటైజర్‌తోపాటు, పీపీఈ కిట్‌ కూడా సిబ్బందికి ఇవ్వాలని అధికారులు నిర్ణయించారు. 9101 పోలింగ్‌ కేంద్రాల్లో 36 వేల మందికిపైగా విధులు నిర్వహించనున్న నేపథ్యంలో అందరికి సరిపడా మెటీరియల్‌ అందుబాటులో ఉంచినట్టు అధికారులు తెలిపారు. కొవిడ్‌-19 పాజిటివ్‌గా నిర్ధారణ అయిన వారికీ ఓటు వేసే అవకాశం కల్పించాలని నిర్ణయించిన నేపథ్యంలో పోలింగ్‌ అధికారులు, సిబ్బంది పీపీఈ కిట్‌లు ధరించాల్సి ఉంటుందని చెప్పారు. 


పోలింగ్‌ తేదీ -01-12-2020

ఎన్ని గంటల నుంచి ఎన్ని గంటల వరకు - ఉ.7 నుంచి సా.6 వరకు


ఫ్‌ఐఆర్‌  నమోదు చేసినవి-99


ఎన్నికల కోడ్‌కు సంబంధించి వచ్చిన ఫిర్యాదులు 100


సీజ్‌ చేసిన ఇతర వస్తువుల విలువ రూ.14,68,941


ఇప్పటి వరకు సీజ్‌ చేసిన నగదు -  రూ.1,46,37,180


శానిటైటజర్‌ సీసాలు పోలింగ్‌ కేంద్రానికి ఐదు చొప్పున(500 ఎంఎల్‌) 60,000


కొవిడ్‌- 19 కిట్‌లు ఒక్కో పోలింగ్‌ కేంద్రానికి పది చొప్పున  1,20,000


హెల్త్‌ నోడల్‌ ఆఫీసర్లు  19


 పంపిణీ చేసిన పోలింగ్‌ స్లిప్పులు  68,51,697 (92.04 శాతం)


పోలీస్‌ బందోబస్తు  52,500


బ్యాలెట్‌ బాక్సులు  28,683

కౌంటింగ్‌ హాళ్లు  158

కౌంటింగ్‌ కేంద్రాలు  150

డీఆర్‌సీ కేంద్రాలు  30

మొత్తం పోలింగ్‌ సిబ్బంది 48,000


ప్రిసైడింగ్‌ అధికారులు 9,101

అసిస్టెంట్‌ ప్రిసైడింగ్‌ అధికారులు  9,101


ఏ పార్టీ ఎన్ని డివిజన్లలో...

టీఆర్‌ఎస్‌- 150 

బీజేపీ - 149 

కాంగ్రెస్‌ - 147 

టీడీపీ- 106 

ఎంఐఎం - 51 

సీపీఐ- 17 

సీఎంపీ- 12 

రిజిస్టర్డ్‌ పార్టీల అభ్యర్థులు - 76

స్వతంత్రులు - 415


సూక్ష్మ పరిశీలకులు 1,729

వీడియో గ్రఫీ టీంలు 5,095


వెబ్‌కాస్టింగ్‌ 2,277

జోనల్‌/రూట్‌ ఆఫీసర్లు  661


స్టాటిస్టికల్‌ సర్వైలెన్స్‌ బృందాలు 30


ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ 60


వ్యయ పరిశీలకులు  34


సాధారణ పరిశీలకులు 14


సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలు 279

అతి సున్నిత పోలింగ్‌ కేంద్రాలు 1,207

సున్నితమైన పోలింగ్‌ కేంద్రాలు 2,336


లొకేషన్లు 2,937

పోలింగ్‌ కేంద్రాలు 9,101


80 యేళ్లు దాటిన, దివ్యాంగులు, కొవిడ్‌-19 పాజిటివ్‌ -  260

పోస్టల్‌ బ్యాలెట్లు ఇచ్చినవి 2,571


పోస్టల్‌ బ్యాలెట్‌ దరఖాస్తులు  2,831

అత్యల్ప పోలింగ్‌ కేంద్రాలు - రామచంద్రాపురం  - 33

అత్యధిక పోలింగ్‌ కేంద్రాలు - కొండాపూర్‌   - 99


అత్యల్ప ఓటర్లున్న డివిజన్‌ రామచంద్రాపురం 28,118

అత్యధిక ఓటర్లు ఉన్న డివిజన్‌ మైలార్‌దేవ్‌పల్లి 79,579


వార్డులు150

పోటీలో ఉన్న అభ్యర్థులు  1122


స్త్రీలు- 35,65,896

పురుషులు- 38,77,688

ఇతరులు -676

మొత్తం- 74,44,260

Updated Date - 2020-11-30T16:20:50+05:30 IST