కాళేశ్వరి రిఫైనరీ పరిశ్రమలో తనిఖీలు

ABN , First Publish Date - 2021-07-23T07:22:41+05:30 IST

వాకలపూడి ఇండస్ట్రియల్‌ ఏరియాలో ఉన్న కాళేశ్వరి రిఫైనరీ ఇండస్ట్రీస్‌ సంస్థలో గురువారం విశాఖ పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు(పీఈబీ) జాయింట్‌ కమిషనర్‌ కార్యాలయం నుంచి ఈఈ వెంకటేశ్వరరావు, కేవీ రావు, కాకినాడ పీఈబీ నుంచి ఈఈ వెంకటేశ్వర్లు తనిఖీలు నిర్వహించారు.

కాళేశ్వరి రిఫైనరీ పరిశ్రమలో తనిఖీలు
కాలుష్య వర్థాలను పరిశీలిస్తున్న పొల్యూషన్‌ అధికారులు

సర్పవరం జంక్షన్‌, జూలై 22: వాకలపూడి ఇండస్ట్రియల్‌ ఏరియాలో ఉన్న కాళేశ్వరి రిఫైనరీ ఇండస్ట్రీస్‌ సంస్థలో గురువారం విశాఖ పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు(పీఈబీ) జాయింట్‌ కమిషనర్‌ కార్యాలయం నుంచి ఈఈ వెంకటేశ్వరరావు, కేవీ రావు, కాకినాడ పీఈబీ నుంచి ఈఈ వెంకటేశ్వర్లు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా పీఈబీ ఈఈ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ కాళేశ్వరి రిఫైనరీ కంపెనీ కాలుష్య కారక రసాయనాలు విడుదల చేస్తోందని, పర్యావరణానికి కాలుష్యంతో హాని కలిగిస్తోందని హ్యూమన్‌ రైట్స్‌ కమిటీ, సీపీఐ సభ్యుల ఫిర్యాదు మేరకు కాలుష్యంపై తనిఖీలు చేపట్టామన్నారు. ఈ సందర్భంగా కంపెనీలో బాయిలర్స్‌, పరిశీలన, వాకలపూడి, బైపాస్‌ అచ్చంపేట సెంటర్‌, వేట్లపాలెం తదితర ప్రాంతాల్లో ఇరిగేషన్‌, కెనాల్స్‌ల్లో ఉన్న వ్యర్థాలను పరిశీలించామన్నారు. ఈ సందర్భంగా శాంపుల్స్‌ సేకరించి పరీక్షకు ల్యాబ్‌కు పంపిస్తామన్నారు. కాళేశ్వరి రిఫైనరీ కంపెనీ విడుదల చేస్తున్న రసాయన కారక కాలుష్యంతో నీరు, భూగర్భజలాలు కలుషితమవుతున్నాయని, స్థానికులు పలు రకాల అనారోగ్యాలబారిన పడుతున్నారని ఫిర్యాదు చేసినట్లు సీపీఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు, హ్యూమన్‌ రైట్స్‌ ఫోరం సభ్యులు అడియారపు శ్రీను, మేరీ కుమారి తెలిపారు. 

Updated Date - 2021-07-23T07:22:41+05:30 IST