Pollution కొట్టుకుపోయింది..

ABN , First Publish Date - 2021-10-14T16:29:40+05:30 IST

వినాయక నిమజ్జనం తర్వాత హుస్సేన్‌సాగర్‌లో కాలుష్యం తీవ్రత తగ్గింది. అయితే, ఘనవ్యర్థాల శాతం పెరిగిందని, నీటిలో కరిగిన ఆక్సిజన్‌ శాతం తగ్గిందని సీనియర్‌ ఎన్విరాన్‌మెంటల్‌

Pollution కొట్టుకుపోయింది..

నిమజ్జనం తర్వాత సాగర్‌ నీటిలో స్వచ్ఛత

స్పల్పంగా పెరిగిన ఘన వ్యర్థాలు..   

తగ్గిన ఆక్సిజన్‌ పరిమాణం 


హైదరాబాద్‌ సిటీ: వినాయక నిమజ్జనం తర్వాత హుస్సేన్‌సాగర్‌లో కాలుష్యం తీవ్రత తగ్గింది. అయితే, ఘనవ్యర్థాల శాతం పెరిగిందని, నీటిలో కరిగిన ఆక్సిజన్‌ శాతం తగ్గిందని సీనియర్‌ ఎన్విరాన్‌మెంటల్‌ సైంటిస్ట్‌, రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి ప్రాజెక్ట్‌ అధికారి బుధవారం విడుదల చేసిన నివేదికలో వెల్లడించించారు.  నిమజ్జన అనంతరం నీటిలో టీడీఎస్‌, సీఓడీ, బీఓడీ పరిణామాణాలు పెరిగాయని, వెల్లడించారు. నిమజ్జనం తర్వాత భారీవర్షాల వల్ల నీరు చేరడం వల్ల హుస్సేన్‌సాగర్‌ తిరిగి సాధారణ స్థితికి చేరిందని, నీటిలో కరిగిన ఘనవ్యర్థాలు తొలిగిపోయి, నీటిలో ఆక్సిజన్‌ పరిమాణం మెరుగయిందని తెలిపారు.  

హుస్సేన్‌సాగర్‌ లేక్‌లో ఎన్టీఆర్‌ పార్క్‌ సమీపంలో ప్లాట్‌ ఫాం 1, 2, లుంబిని పార్క్‌, నెక్లెస్‌రోడ్‌, లేపాక్షి, హుస్సేన్‌సాగర్‌లోని  బుద్దుడి విగ్రహం ఇలా ఆరు ప్రాంతాలలో నిమజ్జనానికి ముందు, తర్వాత నీటిని పీసీబీ అధికారులు కాలుష్యం లెక్కలు తీశారు. వాటిని సనత్‌నగర్‌ కార్యాలయంలో పరీక్షించి నివేదిక రూపొందించారు. నిమజ్జన సమయంలో తగ్గిన నీటిలో కరిగిన ఆక్సిజన్‌ నిల్వలు, నిమజ్జనం అనంతరం సాధారణ స్థితికి చేరుకున్నట్లు పీసీబీ నివేదికలో పేర్కొంది. నిమజ్జనం అనంతరం పరీక్షించిన 6 ప్రాంతాల్లో టోటల్‌ డిసాల్వ్‌డ్‌ సాలిడ్స్‌ (టీడీఎస్‌) పెరిగినట్లు, నిమజ్జన సమయంలో నీటిలో సీఓడీ, బీఓడీ శాతాలు గణనీయంగా పెరిగినట్లు పీసీబీ నివేదికలో వెల్లడయిందని తెలిపారు. నీటిలో భారీలోహాల శాతంలో నిమజ్జనానికి ముందు నిమజ్జనం తర్వాత పెద్దగా మార్పులేదన్నారు.

Updated Date - 2021-10-14T16:29:40+05:30 IST