బుబ్కా 26 ఏళ్ల రికార్డు బద్దలు

ABN , First Publish Date - 2020-09-19T09:09:07+05:30 IST

ఉక్రెయిన్‌కు చెందిన పోల్‌వాల్ట్‌ దిగ్గజం సెర్గీ బుబ్కా 26 ఏళ్ల అవుట్‌ డోర్‌ వరల్డ్‌ రికార్డు బద్దలైంది. రోమ్‌లో జరిగిన డైమండ్‌ లీగ్‌లో ...

బుబ్కా  26 ఏళ్ల రికార్డు బద్దలు

రోమ్‌: ఉక్రెయిన్‌కు చెందిన పోల్‌వాల్ట్‌ దిగ్గజం సెర్గీ బుబ్కా 26 ఏళ్ల అవుట్‌ డోర్‌ వరల్డ్‌ రికార్డు బద్దలైంది. రోమ్‌లో జరిగిన డైమండ్‌ లీగ్‌లో స్వీడన్‌కు చెందిన ఆర్మండ్‌ డుప్లాంటిస్‌ 6.15 మీటర్ల ఎత్తు దూకి కొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. దాంతో 1994లో ఇటలీలో బుబ్కా నమోదు చేసిన 6.14 మీ. రికార్డు కనుమరుగైంది. వరల్డ్‌ ఇండోర్‌ రికార్డు (6.18 మీ.) కూడా 20 ఏళ్ల ఆర్మండ్‌ పేరిటే ఉండడం విశేషం.

Updated Date - 2020-09-19T09:09:07+05:30 IST