Advertisement
Advertisement
Abn logo
Advertisement

చెరువు నిండా నీరు.. వరి వద్దంటే ఎలా సారు

 తడి ఆరని ఆయకట్టు భూములు  

  ఈసారి బీడు పెట్టుకోవాల్సిందేనా అని  రైతుల ఆందోళన

సైదాపూర్‌, డిసెంబరు 2: యాసంగిలో వరి సాగు చేయవద్దని ప్రభుత్వం చెబుతోంది. చెరువు లు, కుంటలు, కాలువ ఆయకట్టు ప్రాంతాల భూముల నుంచి నిత్యం నీరు ప్రవహిస్తూ ఉంటుంది. ఆ భూములు ఎప్పుడు నీటితో తడిగా ఉంటాయి. బావుల్లో నీరు నిండుగా ఉండడంతో జాలు వచ్చి దిగువ ప్రాంతాల్లోని భూములు ఆరకుండా ఎప్పుడు నీటితో తడిగా ఉంటున్నాయి. ఆ భూముల్లో వరి తప్ప వేరే పంట పండే అవ కాశం లేదు. ఏ పంట వేసిన ఎర్రబడి ఎదుగు దల నిలిచిపోతుంది. ప్రభుత్వం వరి వద్దంటే ఆ భూముల్లో ఏం పండించాలని రైతులు ప్రశ్నిస్తు న్నారు. సైదాపూర్‌ మండలంలో 35,000 వేల ఎక రాల భూమి ఉండగా అందులో 32,000 ఎకరాల భూమి సాగవుతుంది. 

అందులో సుమారు 18500 ఎకరాలు వరి సాగవుతుంది. మండలంలో మొత్తం 92 చెరువులు, కుంటలు ఉండగా, 88 చెరువులు, కుంటలు నిండి అందుబాటులో ఉన్నాయి. వీటి కింద 6,930 ఎకరాల ఆయకుట్టు ఉండగా 5600 ఎకరాల భూమి సాగవుతుంది. దిగువ ప్రాంతం లోని భూమి నాలుగు వేల ఎకరాల వరకు ఉం టుంది. ఈ భూముల్లో వరి మాత్రమే పండుతుంది. ప్రభుత్వం ఈ పరిస్థితిని గుర్తించి ప్రత్యమ్నాయ మార్గం చూపాలని రైతులు కోరుతున్నారు. 

పొలాల నిండా నీళ్లున్నాయి

గొళ్లపల్లి దేవేందర్‌, రైతు, బొమ్మకల్‌

నాకు బొమ్మకల్‌ చెరువు కిందనే నాలుగు ఎకరాల భూమి ఉంది.  ఆ పొలాల్లో నీరు నిల్వ ఉన్నాయి. చెరువుల కింద ఆయకట్టు భూముల నుంచి 24 గంటలు నీరు ప్రవహిస్తుంది. దాంతో ఆ భూములు ఎప్పుడు తడిగా ఉంటున్నాయి. వరి తప్ప వేరే పంట వేస్తే పండే అవకాశం లేదు. 

Advertisement
Advertisement