నియోజకవర్గంలో తిరగడానికి పాస్‌పోర్ట్‌ అక్కర్లేదు

ABN , First Publish Date - 2021-01-18T09:10:34+05:30 IST

‘ప్రజా అభిమానమే నాకు చాలా పెద్ద పదవి. నియోజకవర్గంలో తిరిగేందుకు నాకు పాస్‌పోర్టు అక్కర్లేదు. ప్రజల ప్రేమ, అభిమానం నాపై ఉన్నాయి. పదవి భగవంతుడు ఇవ్వాలనుకున్నప్పుడు ఎవ్వరు అడ్డుపడ్డా ఆగదు.

నియోజకవర్గంలో తిరగడానికి పాస్‌పోర్ట్‌ అక్కర్లేదు

పదవులు ఎవడి అబ్బ సొత్తు కాదు

పొంగులేటిశ్రీనివాసరెడ్డి


సత్తుపల్లి/వేంసూరు, జనవరి 17: ‘ప్రజా అభిమానమే నాకు చాలా పెద్ద పదవి. నియోజకవర్గంలో తిరిగేందుకు నాకు పాస్‌పోర్టు అక్కర్లేదు. ప్రజల ప్రేమ, అభిమానం నాపై ఉన్నాయి. పదవి భగవంతుడు ఇవ్వాలనుకున్నప్పుడు ఎవ్వరు అడ్డుపడ్డా ఆగదు. అలాగే పదవి పోయేటప్పుడు ఎన్ని కాంక్రీటు గోడలు కట్టుకున్నా పోకుండా ఆగదు. పదవులు ఎవడి అబ్బా సొత్తు కాదు’ అని ఖమ్మం మాజీ ఎంపీ, టీఆర్‌ఎస్‌ సీనియర్‌ నేత పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఘాటుగా వ్యాఖ్యానించారు. ఆదివారం ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గం వేంసూరు మండలం కుంచపర్తి గ్రామానికి ఆయన వెళ్లారు.


ఈ సందర్భంగా పలువురు టీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు కలిసి నియోజవర్గంలోని సమస్యలు, రాజకీయ పరిణామాలను పొంగులేటి దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తాను హాజరయ్యే సమావేశాలు, కార్యక్రమాలకు వెళ్లొద్దని పార్టీ కార్యకర్తలకు చెప్పడం సరికాదని, తాము గ్రామాలకు వెళ్లాలంటే ఎవరి అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదని, ఏ పాస్‌పోర్టు అక్కర్లేదని వ్యాఖ్యానించారు. నియోజకవర్గంలో కక్షపూరిత రాజకీయాలు చేయ్యొద్దని అభ్యర్థిస్తున్నానని, నష్టపోయిన వారిని ఎలా కాపాడుకోవాలో తెలియనంత అసమర్థులం కాదని ఆయన అన్నారు.

Updated Date - 2021-01-18T09:10:34+05:30 IST