Abn logo
Oct 13 2021 @ 16:08PM

తెలంగాణ ద్రోహిగా కేసీఆర్ నిలిచిపోతారు: పొన్నాల లక్ష్మయ్య

హైదరాబాద్: తెలంగాణకు ముఖ్యమంత్రి కేసీఆర్ ద్రోహం చేస్తున్నారని కాంగ్రెస్‌ సీనియర్ నేత, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య విమర్శించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ ద్రోహిగా కేసీఆర్ నిలిచిపోతారన్నారు. అసెంబ్లీలో ప్రతిపక్షాలకు మాట్లాడే అవకాశం ఇవ్వరని ఆరోపించారు. కేసీఆర్ ఓంటెద్దు పోకడలు తెలంగాణకు నష్టం చేస్తున్నాయన్నారు. తప్పులు కప్పిపుచ్చుకునేందుకే కొత్త ప్రాజెక్టుల ప్రకటనలు చేస్తున్నారని ఆరోపించారు. అక్టోబర్ 14 తెలంగాణకు బ్లాక్ డేగా నిలిచిపోతుందన్నారు. కేఆర్ఎంబీ పాపం కేసీఆర్‌కు ఊరికేపోదని పొన్నాల లక్ష్మయ్య వ్యాఖ్యానించారు.

ఇవి కూడా చదవండిImage Caption