Abn logo
Oct 18 2020 @ 22:45PM

బుట్టబొమ్మకు ఉడుత ఫిదా

Kaakateeya

బుట్టబొమ్మ పూజా హెగ్డే సోషల్‌ మీడియా ఇన్‌స్టాగ్రమ్‌లో చేసిన వీడియో ఒకటి వైరల్‌ అవుతుంది. అల వైకుంఠపురములో చిత్రంలోని 'నీ కాళ్ళను పట్టుకు వదలనన్నవి చూడే నా కళ్ళు' అనే పాట.. ఈ వీడియో చూసిన వారందరికీ గుర్తొస్తుండటం విశేషం. ఏంటి అంత స్పెషల్‌ ఈ వీడియోలో అనుకుంటున్నారా? ఒక ఉడుత.. చెట్టుపై నుంచి దిగివచ్చి.. పూజా హెగ్డే చేతిలో ఉన్న గింజలను తీసుకుని వెళుతుంది. అది అలా తన చేతిలోని గింజలను తీసుకుని వెళ్లిన తర్వాత పూజా ఆనందం చూడాలి. అబ్బో.. వర్ణించలేం.. అది చూస్తేనే తెలుస్తుంది.

అయితే ఉడుతను చూసి ఆమె నాలుగు సార్లు భయపడిందట. ఐదవ సారి ఆమె ధైర్యం తెచ్చుకుని ఈ ప్రయత్నం చేశానని చెబుతూ.. తన ఆనందాన్ని తెలియజేసింది పూజా హెగ్డే. ఇప్పుడీ వీడియో సోషల్‌ మీడియాలో మాములుగా వైరల్‌ అవ్వడం లేదు. ఈ వీడియో చూసిన వారంతా.. బన్నీనే కాదు.. ఉడుత కూడా నిన్ను చూసి ఫిదా అవుతుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Advertisement
Advertisement
Advertisement