Abn logo
May 23 2020 @ 11:15AM

దుల్క‌ర్ జోడీగా బుట్ట‌బొమ్మ‌..?

‘ఒక‌లైలా కోసం’ చిత్రంతో తెలుగులో హీరోయిన్‌గా కెరీర్‌ను స్టార్ట్ చేసిన పూజా హెగ్డే ఇప్పుడు స్టార్ హీరోయిన్ రేంజ్‌కు చేరుకుంది. ప్ర‌స్తుతం యంగ్ రెబ‌ల్‌స్టార్ ప్ర‌భాస్20వ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్‌గా న‌టిస్తోంది. అలాగే అఖిల్ అక్కినేని, బొమ్మ‌రిల్లు భాస్క‌ర్ చిత్రం ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ చిత్రంలోనూ పూజా హెగ్డే హీరో్యిన్‌గా న‌టిస్తోంది. ఇవి కాకుండా లేటెస్ట్ స‌మాచారం మేర‌కు దుల్క‌ర్ స‌ల్మాన్ హీరోగా తెర‌కెక్క‌బోయే చిత్రంలోనూ పూజ హీరోయిన్‌గా న‌టించ‌నుంద‌ని అంటున్నారు. వైజ‌యంతీ మూవీస్ బ్యాన‌ర్‌పై హ‌నురాఘ‌వ‌పూడి ద‌ర్శ‌క‌త్వంలో సినిమా తెర‌కెక్క‌నుంది. త్వ‌ర‌లోనే ఈ సినిమాకు సంబంధించి మ‌రిన్ని వివ‌రాలు వెల్ల‌డికానున్నాయి. 

Advertisement
Advertisement
Advertisement